హుజురాబాద్‌లో కారు‌కు బ్రేకు లేనట్టేనా.. అనూహ్యంగా కలిసొచ్చిందే?

హుజురాబాద్ బై ఎలక్షన్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విక్టరీ చాన్సెస్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి.అయితే, అవి ఇప్పటి పరిస్థితులకు మాత్రమే.

ఇంకొద్ది రోజులకు ఏదైనా జరగొచ్చు.మొదటి నుంచి నియోజకవర్గంలోనే పట్టున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పాదయాత్రలోనూ జోష్‌గానే కనిపించారు.

స్వల్ప అస్వస్థతకు గురై పాదయాత్ర స్టాప్ చేశారు.అయితే, పాదయాత్ర శాశ్వతంగా స్టాప్ అయ్యే చాన్సెస్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకు ఆయన ఆరోగ్య పరిస్థితియే కారణమని తెలుస్తోంది.కాగా, ఈ క్రమంలోనే గులాబీ పార్టీ దూకుడు పెంచుతున్నది.

Advertisement

ఈ నెల 16న ‘దళిత బంధు’కు ముహుర్తం ఖరారు చేయగా, నియోజకవర్గంలో పెన్షన్ల మంజూరు, కొత్త రేషన్ కార్డులు, గొర్రెల పంపిణీ ఇతర కార్యక్రమాలతో పింక్ పార్టీ గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది.ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న ప్రతీ ఒక్కరు కారు గుర్తుకు మాత్రమే ఓటు వేయాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కారుకు బ్రేకులు ఉండబోవేమోనని, అనూహ్యంగా టీఆర్ఎస్ విజయం సాధించబోతుందేమోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతున్నది.

బీజేపీతో ఫైట్ ఉండబోతున్నదని ఆల్రెడీ అంచనా వేసుకున్న గులాబీ పార్టీ ఆల్రెడీ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలనూ సరి చేస్తోంది.సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డిని గులాబీ గూటికి చేర్చుకోగా, ఆయన టికెట్ ఆశిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.ఇక బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నర్సింహులు బహింరంగంగా టీఆర్ఎస్‌కే మద్దతు ప్రకటించారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలనూ పింక్ పార్టీ తన గూటికి చేర్చుకుంది.ఇప్పటికే పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వగా, బీసీ అభ్యర్థికి పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇనుగాల పెద్దిరెడ్డి, పొనగంటి మల్లయ్య, వకుళాభరణం కృష్ణమోహన్, కనుమల్ల విజయ, గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవి పేర్లు టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా పెట్టేందుకు పరిశీలనలో ఉన్నాయి.ఈ విషయమై అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌గా ఉండబోతుంది.

Advertisement

మొత్తంగా మొన్నటి వరకు హుజురాబాద్ రాజకీయం ఒక రకంగా ఉండగా ప్రస్తుతం అధికార పార్టీ గెలుపు వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు