ANR శత దినోత్సవ వేడుకలకు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి నటన అంటే ఏంటో నేర్పించిన ఇద్దరు ముగ్గురు మహనుభావులలో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు గారు.

( Akkineni Nageswara Rao )సినిమా పుట్టినప్పటి నుండి ఈయన తన నట ప్రస్థానం ని ప్రారంభించాడు.

నందమూరి తారకరామారావు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే ఈయన పెద్ద స్టార్ అయ్యాడు.ఎన్నో అద్భుతమైన పాత్రలు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కలిగిన ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వర రావు.

ఇండియాలోనే అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఏకైక సూపర్ స్టార్ ఆయన.అలాగే ఆయన హీరోగా నటించిన చిత్రాలలో 114 సినిమాలు డైరెక్ట్ 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి అంటే ఆయన తెలుగు ప్రేక్షకుల మదిలో వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.అలాంటి మహానుభావుడు పుట్టి వందేళ్లు అయిన సందర్భంగా, ఆయన తనయుడు అక్కినేని నాగార్జున( Nagarjuna Akkineni ) అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వర రావు గారు విగ్రహ ఆవిష్కరణ చేసాడు.

Is That The Reason Why Chiranjeevi Did Not Come To The Anr Centenary Day Celebr

ఈ ఈవెంట్ కి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu ) తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ( Mahesh Babu )మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,( Ram Charan )మోహన్ బాబు,న్యాచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీళ్లకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి.ఇకపోతే ఈ ఈవెంట్ కి నాగార్జున తన సొంత సోదరుడిగా భావించే మెగాస్టార్ చిరంజీవి రాకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Is That The Reason Why Chiranjeevi Did Not Come To The Anr Centenary Day Celebr

నాగేశ్వర రావు గారు అంటే చిరంజీవి కి ఆరాధ్య దైవం తో సమానం.ఆయన తల్లి అంజనా దేవి నాగేశ్వర రావు గారికి వీరాభిమాని.ఇక నాగేశ్వర రావు గారి గురించి ఎప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా చిరంజీవి మనస్ఫూర్తిగా ఎంతో సంతోషం తో, పొగడ్తలతో ముంచి ఎత్తుతాడు.

ఇలాంటి సందర్భాలు గతం లో మనం ఎన్నో చూసాము.

Is That The Reason Why Chiranjeevi Did Not Come To The Anr Centenary Day Celebr

అలాంటి చిరంజీవి ఎందుకు ఈ విగ్రహావిష్కరణ కి రాలేదు అని సోషల్ మీడియా లో అభిమానులు మాట్లాడుకుంటున్నారు.భోళా శంకర్ ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి ఏ ఈవెంట్ లో కూడా ఈమధ్య కనిపించడం లేదు.ఆ సినిమా ఫ్లాప్ చిరంజీవి ని కృంగదీసింది అనే సందేహాలు కూడా ఉన్నాయి.

ఇది పక్కన పెడితే భోళా శంకర్ సినిమా ( Bhola Shankar )తర్వాత చిరంజీవి తన మోకాళ్ళకు సంబంధించి సర్జరీ చేయించుకున్నాడు.డాక్టర్లు ఎక్కువగా మోకాళ్లపై వత్తిడి పెట్టొద్దు, విశ్రాంతి అత్యవసరం అని చెప్పడం తో చిరంజీవి ఈవెంట్స్ కి వెళ్లడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

చిరంజీవి ని ఆరాధ్య దైవం గా భావించే బ్రహ్మానందం రెండవ కొడుకు పెళ్లి రీసెంట్ గానే జరిగింది,ఈ పెళ్ళికి కూడా చిరంజీవి హాజరు కాలేకపోయారు.ఇదంతా ఆయనకీ జరిగిన మోకాళ్ళ సర్జరీ కారణంగానే అని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు