పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా..?..లేదా..??

పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా అనేది ఇప్పుడు అందరిని వేదిస్తున్న ప్రశ్న.ముఖ్యంగా ఈ ప్రశ్న జనసైనికులలో ఎక్కువగా నానుతోంది.

మన పవర్ స్టార్ సీఎం అవుతాడా లేదా అంటూ ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు.సరే వారి లెక్కలు పక్కన పెడితే అసలు పవన్ సీఎం అవుతాడా.?? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం ఫీటం పై కూర్చుంటాడా.? ఒక యువనాయకుడిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా.?? అబ్బో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కాని చివరికి సీఎం అవుతాడా లేదా అనేది క్లారిటీ కావాలి.సరే

ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించే స్థాయి నుంచీ అధికారం చేపట్టాలి అనే స్థాయికి వెళ్ళాడు ఈ మధ్యకాలంలో.2014 లో చంద్రబాబు కి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత బాబు విధానాలపై పెదవి విరిచాడు.మెల్ల మెల్లగా ప్రశ్నించడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే ఒంటరిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోరు ఉంటుందని ప్రకటించి అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో పవన్ సీఎం అవుతాడనే కోరికని కల్పించాడు.

ఆ కోరికే ఇప్పుడు నినాదం అవుతోంది.సీఎం.సీఎం అంటూ అందరి నోటా ఒకటే మాట చివరికి పవన్ కళ్యాణ్ కూడా మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా సీఎం అవుతానని ప్రతీ వేదికపై తెలుపుతున్నాడు.

Advertisement

కట్ చేస్తే పవన్ కి యువకులలో భారీ ఫాలోయింగ్ ఉంది.మాస్ లో కూడా దూసుకుని వెళ్ళగలిగేలా పవన్ ఓ మాస్ అండ్ క్లాస్ లీడర్ లా కూడా కనిపిస్తూ ఉంటాడు.

పవన్ సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు.వచ్చే వారిలో ఎవరిని తరలించడం కాని, మందు సీసాలు ,బిర్యాని ప్యాకెట్లు ఇవ్వడం కాని లేదు.

ఇదంతా నిజమే అయితే ఈ ఫాలోయింగ్, ఈ అభిమానం పవన్ ని సీఎం చేస్తాయా అంటే చెప్పే పరిస్థితి లేదు.గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రజలు సభలకు ఇలానే వచ్చారు.

ఇక చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.అప్పట్లోనే చిరు, పవన్ కలిసినా సరే కేవలం 18 సీట్లకే పరిమితమయ్యింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

సో దీన్ని బట్టి అందరికి ముఖ్యంగా అభిమానులకి అర్థం కావాల్సింది సభలు సీఎం చేయలేవని.అదీగాక జనసేన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తీ స్థాయిలో జరగలేదు.పార్టీలో పవన్ తప్ప ప్రత్యేకించి బలమైన నాయకులు కూడా లేరు.

Advertisement

అవన్నీ పక్కన పెడితే పవన్ ఉభయగోదావరి , ఉత్తరాంధ్ర లకి మాత్రమే పరిమితమైతే ఇక మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటి.అలాంటప్పుడు పవన్ సీఎం ఎలా అవుతాడు.?? దీన్నిబట్టి చూస్తుంటే పవన్ ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే అవకాశం తక్కువున్నా కానీ గెలుపు ఓటములను మాత్రం ప్రభావితం చేయగలరనేది వాస్తవం అంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయన్నమాట.అయితే చివరిగా ఒక్క మాట పవన్ ఈ ఎన్నికల్లో సీఎం అవ్వకపోవచ్చు కాని భవిష్యత్తు రాజకీయాల్లో కూడా పవన్ ఇదే తరహాలో తన ఊపుని కొనసాగిస్తూ ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉంటే భవిష్యత్తులో అయినా సరే పవన్ తప్పకుండా సీఎం అవుతాడు అనడంలో సందేహం లేదు.

తాజా వార్తలు