'కులాలతో ఆడుకునే ప్రభుత్వాలు' అని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒకరు రాసిన లేఖ ఇది.! ఏది నిజం ఏది అబద్దం.?

కులాలతో ఆడుకొనే ప్రభుత్వాలు కులాలతోనే పతనమౌతాయి!!!

 A Common Man Letter To The Government About Cast-TeluguStop.com

విశ్వవిజేత “ది గ్రేట్ అలెగ్జాండర్”కే భారత రాష్ట్రపతి పదవిని ప్రపోజ్ చేయగలిగిన బాబు, “విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి”కే చుక్కలు చూపెట్టగలిగిన బాబు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికే మకుటం ప్రసాధించగలిగిన మన బాబు, నేడు కులాల పేరుతో, మతాలపేరుతో కొంగ జపాలు చేస్తూ, ఊరులవెంట తిరగాలిసిన పరిస్థితి దాపురించింది.

దుర్యోధన సార్వభౌముడు, కర్ణుడికి అంగ రాజ్యము నిచ్చింది, యదుకులశ్రేస్థుడు బలరాముడితో వియ్యము పొందాలని చూచింది, జరాసంధుడికి వంగి నమస్కారములు చేసినది, శిశుపాలుడితో మంతనాలు జరిపింది ఆయా కులాలపై మమకారంతో కాదు.

పాండవ సోదరులతో రాబోయో యుద్ధము అనే భయముతోనే అనేది గ్రహించాలి.

అధికారములోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అన్ని పదవులను తన కులపోళ్ళకే ఇచ్చుకొని, మిగిలిన కులాలను బాబు అణిచి వేయలేదా? అదే బాబు నేడు వివిధ మతాలు, కులాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు.చంద్రలోకాధీశుడు మొన్న “దళిత తేజము” పెట్టిన, నిన్న “నారా హమారా కాండము తుమారా” పెట్టిన, రేపు రాజముండ్రి సమీపములో “బీసీ గర్జన” పెట్టబోయిన, ఇవి అన్నీ జనసేనుడితో రాబోయే ఎన్నికల యుద్ధము అనే భయముతోనే అని గ్రహించాలి.

అందిన చంచులతో, అంతటి బాబునే నేడు మన కులం వెంట తిరుగుతున్నాడే అని చెప్పే కులనాయకులు లేకపోలేదు.

కులనాయకులకు, ఆ కులనాయకులను ఆడించే స్వార్ధ ప్రభుత్వాలకు చెప్పేది ఒక్కటే.పాములతో సహవాసము చేసేవాడి జీవితము చివరకు పాముకాటుతోనే అంతమౌతుంది అనేది చరిత్ర చెబుతుంది.

పాలు పోసి పెంచిన ప్రభుత్వాన్నే “భింద్రన్ వాలే” కాటేసాడు.భింద్రన్ వాలే ఉద్యమము చేతిలోనే పెంచి పోసించిన వ్యక్తే తన ప్రాణాలు కోల్పోయారు అంటారు.ప్రభాకరన్’ని అవసరాలకు అనుగుణముగా పెంచి పోషించారు.ఆ ప్రభాకరన్ చేతిలోనే ఆ నాయకుడు ప్రాణాలు కోల్పోవాలిసివచ్చింది.

అన్న ఎన్టీఆర్ చంద్రబాబుని చేర దీసి, పెంచి పోషించారు.అతని చేతిలోనే అన్న పదవి కోల్పోయారు.

చివరకు చుక్కల్లోకి పోయారు.నాడు అంబెడ్కర్’కి అడ్డుచెప్పడానికే నాటి నాయకులు జిన్నాని ప్రోత్సహించారు అంటారు.చివరకు ఏమైది తెలుసుకదా!

నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తింది.ఆ తెలంగాణ అంశములోనే కాంగ్రెస్ మాడి మసిఅయిపోయింది.నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రెండుకళ్ల సిద్దాంతముతో రెండు ఉత్తరాలను చంద్రన్న పార్టీ ఇచ్చింది.ఆ రెండుకళ్ల సిద్దాంతమే తెలంగాణాలో టీడీపీ పుట్టు ముంచింది.

ఆంధ్రాలో కూడా పోవాలిసిన టీడీపీ, జనసేనుని బిక్షవల్ల బతికి బట్ట కట్టగలిగింది.

సింగల్ డే అయినా సీఎం అవాలి అనే సింగల్ అజెండాతో, తండ్రి శవాన్ని పక్కనపెట్టుకొని రాజకీయాలు మొదలు పెట్టారు ఒక యువనేత.

చనిపోయిన ప్రతీఒక్కరిని తండ్రికోసమే చనిపోయారు అని ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు.చివరకు ఏమైనది.

పులీ పాయె, ఉప్మా పాయె అన్నట్లు… రెంటికీ చెడ్డ రేవడిలా తయారు అయ్యారు ఆ నాయకుడు.

స్వార్ధ ప్రయోజనాలకోసము, పదవీ వ్యామోహముతో సమాజాన్ని మతాలుగా, కులాలుగా విడగొట్టాలని ప్రభుత్వాలే నేడు ప్రయత్నము చేస్తున్నాయి.

గొప్ప గొప్ప నేతలైన శ్రీమతి ఇందిరా, శ్రీ రాజీవ్, శ్రీ రామారావులే బలియైపోయారు.నువ్వేంత, నీ అధికార దర్పము ఎంత.చరిత్రలో పట్టాపొంది, చరిత్రనే మార్చాలని చూస్తే, మతాల ఊబిలో, కులాల కార్చిచ్చులో మాడి మసైపోతారేమో? చంద్రలోకాధీశా!!! తస్మాతు జాగ్రత్త సుమా.

ఆలోచిద్దాం… ఏది నిజం ఏది అబద్దం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube