జనసేన- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి గత కొంతకాలంగా చర్చలు ఇరు పార్టీల మధ్య జరుగుతూనే ఉన్నాయి.కానీ ఒక కొలిక్కి రావడం లేదు.
గత కొంతకాలంగా ఇరు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా తగ్గింది.అయితే జనసేన నిర్వహించిన ధవళేశ్వరం కవాతు అనంతరం మళ్ళీ ఇరు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి.
కానీ అది తీవ్ర స్థాయిలో మాత్రం కాదు.ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నా… ఏవో చిన్న చిన్న అడ్డంకులు ఆ రెండు పార్టీలకు అడ్డం వస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జగన్, పవన్ చేతులు కలిపేస్తారని.కానీ అది తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత మాత్రమే అన్న క్లారిటీ వచ్చింది.

ఏపీకంటే ముందుగా తెలంగాణాలో ఎన్నికలు జరుగుతుండడంతో అక్కడ ఫలితాలు ఎలా వస్తాయి .ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.ఇలా అనేక అనేక డౌట్లతో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి.దీనిని బట్టి రాజకీయ సమీకరణాల్లో కొత్త పరిణామాలు ఏర్పడతాయని అంటున్నారు.అధికార టిఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జట్టు కట్టాయి.కూటమి విజయం సాధిస్తే ఏపీలో కూడా అన్ని పార్టీలు తెలుగుదేశాన్ని ఓడించడమే ఏకైక ఎజెండాగా అన్ని పార్టీలు కలిసిపోయే అవకాశం కనిపిస్తోంది.

ఈ పరిణామాలు టీడీపీలో కలవరం పుట్టిస్తున్నాయి.అనుకు ముందుగానే మేల్కొని వైసిపి, జనసేన తో మైండ్ గేమ్ ను టిడిపి మొదలు పెట్టింది.ఎవరితో పొత్తు లేకుండా దమ్ముంటే పోటీ చేయాలంటూ సవాలు చేస్తోంది.ఏపీలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్న జనసేన ఇప్పటికే కమ్యూనిస్ట్ లతో ముందుకు సాగుతుంది.
అయితే వైసిపి మాత్రం ఏ పార్టీతో పొత్తు లకు ఆలోచన చేయకుండా ముందుకు సాగుతుంది.కానీ తెలంగాణ ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్ల శాతాన్ని బట్టి వైసిపి – జనసేన పొత్తు ఆధారపడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
అప్పటి వరకు ఈ రెండు పార్టీల కార్యకర్తలకు, నాయకులకు సస్పెన్స్ తప్పదు.
.