జనసేన లో ' కట్టప్పలు ' నిజమేనా ? పవన్ భయం అదేనా ?

పార్టీలో కోవర్ట్ లు ఉన్నారని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన దగ్గర నుంచి అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.

గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో కోవర్ట్ రాజకీయాలు ఆ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి.

చివరకు ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం అయ్యేవరకు పరిస్థితిని తీసుకువెళ్లాయి.ప్రజారాజ్యానికి ఆ గతి పట్టడానికి కారణం కోవర్ట్ రాజకీయాలేననే విషయం పవన్ కళ్యాణ్ లో బలంగా నాటుకుపోయింది.

ఇప్పుడు అదే పరిస్థితి జనసేన పార్టీకి కలిగించేందుకు తమ రాజకీయ ప్రత్యర్థులు పన్నాగం పన్నారనే విషయాన్ని పవన్ కాస్త ఆలస్యంగా గుర్తించారు.ముఖ్యంగా వైసీపీకి చెందినవారు జనసేనలో చేరి పార్టీని క్షేత్రస్థాయిలో డ్యామేజ్ చేస్తున్నారని,  నిజమైన కార్యకర్తలు పని చేయకుండా అడ్డుకుంటున్నారనే ఫీడ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ కు చేరింది.

అది కాకుండా కీలక నాయకులుగా ఉన్నవారిలోనూ ఒకరిద్దరూ కోవర్ట్ లు అనే అనుమానంతో పవన్ ఉన్నారు.అయితే వారు కోవర్టులనే విషయాన్ని బయటకు ప్రకటించలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ కు ఉంది.

Advertisement

అందుకే కోవర్ట్ లు ఎవరో తనకు తెలుసునని దయచేసి బయటకు వెళ్లిపోండి అంటూ పవన్ ప్రకటన చేస్తున్నారు.పార్టీలో ఎవరు తప్పు చేసినా, వారిని సస్పెండ్ చేస్తామని పవన్ ఆగ్రహం గా ప్రసంగిస్తున్నారు.

ప్రస్తుతం జనసేన గురించి చర్చ జరిగిన సందర్భంలో ఈ కోవర్ట్ రాజకీయాల గురించి ఎక్కువ ప్రస్తావన వస్తోంది.దీంతో జనసేనలో ఏం జరుగుతోందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

పార్టీలో కోవర్ట్ రాజకీయాలు పెరిగిపోవడంతో దానికి పులిస్టాప్ పెట్టేందుకు పవన్ స్వయంగా ఈ ప్రకటన చేశారని ప్రచారం జరుగుతోంది.పార్టీ అంతర్గతంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు వేగంగా ప్రత్యర్థులకు చేరిపోతుండడం, దానికి అనుకూలంగా వారు జనసేన పై విమర్శలు చేయడం,  తమ నిర్ణయాలు కాకుండా ఆడుకునేందుకు ప్రయత్నించడం ఇవన్నీ గత కొంతకాలంగా చోటు చేసుకుంటూ ఉండడంతో పవన్ ఈ విధంగా బరస్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. 

జనసేన లో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని,  నాదెండ్ల మనోహర్ వల్లే చాలామంది నాయకులు బయటకు వెళ్లిపోయారనే చర్చ కొంతమంది లేవనెత్తడంతో ఇదంతా కోవర్ట్ ల పనేనని,  పవన్ నాదెండ్ల మనోహర్ ను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ  వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచే కట్టప్పలు ఎవరు అనేది పవన్ కు ఒక అవగాహన వచ్చిందని  ,వారి భరతం పడతారని, జనసేనలోని కీలక నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు