ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించినటువంటి దర్బార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల అయింది.ఈచిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు.
అలాగే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, నివేదా థామస్, ప్రతీక్ బబ్బర్ వంటి వాళ్లు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ రోజున విడుదల అయ్యింది.
ఈ అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది.
అయితే ఈటీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్రవారాల్లో వచ్చేటువంటి జబర్దస్త్ కామెడీ షో లో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది మనల్ని ఎంతగానో అలరిస్తాడో చెప్పనవసరం లేదు. అయితే హైపర్ ఆది కి దర్బార్ కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా.

దర్బార్ చిత్రంలో ఓ సన్నివేశంలో ఒక గోల్డ్ చైన్ పోయిందంటూ నయనతార రజినీకాంత్ కి ఫోన్ చేస్తుంది.అయితే అక్కడికి చేరుకున్న రజనీకాంత్ చైన్ ఎలా పోయిందంటూ ఒక చిన్న పాపని అడుగుతాడు.అప్పుడు ఆ చిన్న పాప చైన్ ఎలా పోయిందో తెలుసి ఉంటె ఇంక మీరు ఎందుకు అంకుల్ అంటూ రజనీకాంత్ కి రివర్స్ పంచ్ వేస్తుంది.దీంతో రజినీకాంత్ పక్కనే ఉన్నటువంటి ప్రముఖ కమెడియన్ యోగిబాబు హైపర్ ఆది ఎఫెక్ట్ సార్ అంటూ మళ్లీ రివర్స్ పంచ్ వేస్తాడు.
దీంతో మన హైపర్ ఆది పేరు ప్రస్తుతం థియేటర్లలో మార్మోగిపోతోంది.ఏదేమైనప్పటికీ మన తెలుగు కమెడియన్ హైపర్ ఆది పేరు రజినీకాంత్ సినిమాలో వాడుకోవడంతో హైపర్ ఆది అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.