ఇంతకీ డీకే టి.కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తున్నారా లేదా ? 

ఇటీవల కర్ణాటకలో( Karnataka ) జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రభావం స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తోంది.

అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ తరహాలోనే తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తారని ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది.

అందుకే ఏ విషయంలో అయినా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ముడి పెడుతూ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు.అంతేకాదు వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించే విధంగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది.

డీకే శివకుమార్ ( DK sivakumar )పై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి.కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చడంలో ట్రబుల్ షూటర్ గా ఆయన కీలకంగా వ్యవహరించారు.

పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి వ్యవహారాల్లో డీకే కు మంచి పట్టు ఉన్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది.

Advertisement

అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను డీకే శివకుమార్  అప్పగించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.ఇకపై తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలని డీకే శివకుమార్ చూడబోతున్నారని, ఆయన ఆధ్వర్యంలోని పార్టీలో చేరికలు ఉంటాయని, పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను డీకే తీసుకోబోతున్నట్లుగా హడావుడి జరుగుతుంది.అయితే ఈ వ్యవహారాలపై తాజాగా క్లారిటీ వచ్చింది.

రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లాలో పర్యటించిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే (Manikrao Thakre )ఈ వ్యవహారం పై స్పందించారు.

డీకే శివకుమార్ తెలంగాణకు రావట్లేదని ,ఆయన ఇన్చార్జిగా వస్తున్నారనే దాంట్లో వాస్తవం లేదని, అయితే తెలంగాణలో డీకే ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయంలో ఏఐసీసీ పెద్దలు తీసుకుంటారని మాణిక్ రావు ఠాక్రే క్లారిటీ ఇచ్చారు.అయితే డీకే శివకుమార్  తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తే, పార్టీకి మంచి ఊపు వస్తుందని, కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని భావించిన కాంగ్రెస్ నేతలకు మాణిక్ రావు ఠాక్రే ఇచ్చిన క్లారిటీ తీవ్ర నిరాశ కలిగించినట్లు అయ్యింది.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు