తెలంగాణలో బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేలుస్తూ ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది.టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రతి పనిని విమర్శిస్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతను కలిగిస్తూ, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను పటిష్టం చేస్తూ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తోంది.
కాని బీజేపీ అనుసరిస్తున్న మరో వ్యూహం ఇప్పుడు కార్యకర్తలను కూడా ఆలోచనలలో పడేస్తుంది.ఉదాహరణకు తీసుకుంటే నాగార్జున సాగర్ లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు.
ఆ ఘటనలో పోలీసులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం ఒక ఎస్సై తలకు గాయాలవడం ఇలా అతి పెద్ద ఘర్షణ జరిగింది.అనంతరం ఎవరైతే పోలీసులపై దాడికి పాల్పడ్డ కార్యకర్తలు ఉన్నారో వారిపై కేసులు నమోదు కావడం, ఆ కార్యకర్తలు కటకటాల పాలవడం వంటివి జరిగాయి.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ బాగానే ఉన్నా కార్యకర్తలపై కేసులు నమోదవటం, వారి జీవితాలు చిన్నాభిన్నం కావడాన్ని చూసి మిగతా కార్యకర్తలు ఆలోచలో పడుతున్నట్టు వినికిడి.పార్టీ గెలుపు కోసం కృషి చేసే క్రమంలో దాడుల వ్యూహంలో ఎవరూ పడవద్దని కొంత మంది కార్యకర్తలు గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
