బండి సంజయ్ దీక్షకు దీటుగా మంత్రి గంగుల కౌంటర్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న మౌనదీక్షలో చేసిన ఆరోపణలు, వేసిన కుర్చీపై ఘాటుగా స్పందించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అది మౌనదీక్ష కాదని, తెలంగాణ రాష్ట్రంపై, ప్రభుత్వంపై, ప్రజలపై చేస్తున్న ఈర్షదీక్ష అని, ద్రోహ దీక్ష అని ప్రకటించారు.

 Minister Gangula Kamalakar Counters To Bjp Bandi Sanjay Details, Minister Gangul-TeluguStop.com

నేడు జన్మధినం జరుపుకుంటున్న ఎంపీ బండి సంజయ్కు తెలంగాణకోసం, బీసీల కోసం పోరాడే స్థైర్యాన్ని బగవంతుడు ఇవ్వాలని కోరుకున్నారు మంత్రి గంగుల.ఈ సందర్భంగా తన దీక్షలో కేసీఆర్ గారి కోసం వేసిన కుర్చీపై దీటుగా బదులిచ్చారు మంత్రి, బండి సంజయ్ వేసిన కుర్చీలో కూర్చిన నేను దర్నాలు చేస్తానని అయితే అందుకు బండి సంజయ్ చేయాల్సిన పనుల్ని గుర్తుచేసారు.

మోడీగారి ఆపీసు ముందు కుర్చీవేసుకొని జవాబులు సాధించాల్సిన ప్రశ్నల్ని సందించారు.గత ఎన్నికల హామీల్లో బాగంగా 15లక్షలు అకౌంట్లో వేయనందకు ఏ బ్యాంకు, ఏటీఎం ముందు కుర్చీ వేయాలి, ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు.

అలా 16కోట్ల ఉద్యోగాల కోసం యూపీఎస్సీల ముందు కుర్చీ వేద్దాం అని ప్రశ్నించారు, బ్లాక్ మనీ కోసం ఆర్బీఐ, ఈడీల ముందు కుర్చీ వేసుకొని కూర్చుందాం రమ్మని సంజయ్ని ఆహ్వానించారు.గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజీల్ ధరల పెంపుకోసం దేశంలోని మొత్తం మహిళలతో సహా మేం వస్తామని, ఎల్ఐసీ ఆఫీసు ముందు, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ముందు కుర్చీ వేసుకొని ప్రైవేటీకరణ చేయోద్దని నినదిద్దామన్నారు.

బల్క్ యూజర్లకు బంద్ పెట్టి, రిటైల్ బంకులపై భారం మోపీ క్రుత్రిమ కొరతకు కారణం మోడీ కాదా అని ప్రశ్నించారు.బీసీలు ఓటేస్తే గెలిచిన ఎంపీ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న బండి సంజయ్, చట్టసబల్లో బీసీ రిజర్వేషన్లు, బీసీ జనగణన, బీసీ మంత్రిత్వ శాఖను బీసీ ప్రధాని ఎందుకు ఇవ్వడం లేదనో ప్రశ్నిస్తూ కుర్చీ వేసుకొని దీక్షచేద్దామన్నారు.

గతంలో వడ్లు కొంటామని మాట తప్పినట్లుగా .మీరు ముందస్తు ఎన్నికలకు వస్తామంటే ఎవరు నమ్ముతారని యాసంగిలో రా ఇవ్వండి, వానాకాలం పంట మొత్తం కొంటామన్న బీజేపీ ఎందుకు కొంటలేదన్నారు, ఈ వానాకాలం తెలంగాణ రైతులు వరి వేయాలా వద్దా, చెప్పండని నిలదీసారు.ఇక్కడి బీజేపీ నేతలకు ఆ పార్టీలోనే విలువ లేదని వాళ్లు చెబితే ఎవరు నమ్మరని, మోడీతో ముందస్తు ఎన్నికల ప్రకటన చేయించాలనీ దమ్ముంటే కేసీఆర్ గారి సవాల్ స్వీకరించాలన్నారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవాలని, ఆయనకు భగవంతుడు శక్తినీయాలని కోరుకున్నారు.

తెలంగాణ సాధించిన కేసీఆర్. ప్రజలకు మహారాజేనని ధరణితో 98 శాతం భూ సమస్యలు తగ్గి సమస్యలు, గొడవలు పోయాయన్నారు మంత్రి అక్కడక్కడా ఉన్న ఇబ్బందులు సైతం రెవెన్యూ సదస్సులతో తీరతాయన్నారు.

అకాల వర్షాలతో జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉండాలి కాబట్టే రెవెన్యూ సదస్సులు వాయిదా వేసామని, త్వరలో జరిగే రెవెన్యూ సదస్సులో కొద్దిపాటి సమస్యలు కూడా 100% పరిష్కారమవుతాయన్నారు.వేరే పార్టీలో నుంచి నాయకులను చేర్చుకునేందుకు ఎక్కడైనా కమిటీ వేస్తారా? అది కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లతో కమిటీ వేసిన దౌర్బాగ్య పార్టీ బీజీపే అన్నారు మంత్రి గుంగల.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి, సుంకె పాల్గొని మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube