ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్.. రూ.100కే రైల్వే స్టేషన్‌లో రూమ్..

ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ ( IRCTC ) గుడ్ న్యూస్ అందించింది.కేవలం రూ.

100కే రైల్వే స్టేషన్‌ ( Railway station )లో రూమ్ కేటాయించనుంది.నిద్రపోవడానికి బెడ్‌తో పాటు వాష్ రూమ్ సౌకర్యం ఇందులో ఉంటాయి.

మాములుగా రూమ్ కావాలంటే రూ.వెయ్యి వరకు రైల్వే స్టేషన్‌లో ఛార్జ్ చేస్తారు.కానీ ప్రయాణికుల కోసం రూ.100కే రూమ్ అందించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయం తీసుకోనుంది.వీటిని రిటైనింగ్ రూమ్స్‌గా పిలుస్తున్నారు.

ఈ రూమ్‌లలో ఏసీ సౌకర్యం, బెడ్, ఇతర సదుపాయాలు ఉంటాయి.

Advertisement

రాత్రి పూట రైల్వే ప్రయాణికులు రూమ్ బుక్ చేసుకోవడానికి రూ.100 నుంచి రూ.700 వరకు చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.ఈ రూమ్‌ని ఎలా బుక్ చేసుకోవాలి.

పేమెంట్ ఎలా చెల్లించాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ డీటైల్స్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.ఆ తర్వాత మై బుకింగ్ అని కనిపించే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

మీ టికెట్ బుకింగ్ క్రింద రిటైరింగ్ రూమ్ అనే ఆప్షన్ ఉంటుంది.ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రూమ్ ను బుకింగ్ చూసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

అక్కడ మీ పీఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి.అలాగే మీ జర్నీ డీటైల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

దీంతో రూమ్ బుకింగ్ అవుతుంది.

ఇక పేమెంట్ విషయానికొస్తే.ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చెల్లించే అవకాశం ఉంటుంది.దీంతో పాటు ట్రావెల్స్ ఇన్యూరెన్స్ ( Travels Incurrence ) కూడా లభిస్తుంది కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా అందిస్తారు.ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

దీనిని ఎంచుకోవడం వల్ల మీరు ట్రావెల్స్ ఇన్యూరెన్స్‌ను పొందవచ్చు.

తాజా వార్తలు