ఐఫోన్ 14 సిరీస్ లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే..!

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన లేటెస్ట్ లాంచ్ ఈవెంట్ లో మొబైల్ ప్రియులు ఎంతగానో వేచి చూస్తున్న ఐఫోన్‌ 14 మోడళ్లను రిలీజ్ చేసింది.

అలాగే వాచ్‌ సిరీస్‌ 8, ఎయిర్‌పాడ్స్‌ ప్రో, వాచ్‌ ఎస్‌ఈ2లను లాంచ్ చేసి టెక్ ప్రియులను ఆకట్టుకుంది.

అయితే గత కొద్ది రోజులుగా ఐఫోన్ 14 మోడల్స్ అధిక ధరలతో వస్తాయని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.దీనితో కొనుగోలుదారులు కాస్త నిరాశకి గురయ్యారు.

అయితే యాపిల్ కంపెనీ 14 సిరీస్ ఐఫోన్స్‌ను కొనుగోలుదారులు ఊహించిన ధరలతోనే లాంచ్ చేసింది.మరి వాటి ధరలు, స్పెసిఫికేషన్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.బేస్ మోడల్ ఐఫోన్‌ 14 మొబైల్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేతో రాగా.ఐఫోన్‌ 14 ప్లస్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది.ఈ రెండు మొబైల్స్ మిడ్‌నైట్‌, స్టార్‌లైట్‌, బ్లూ, పర్పుల్‌, ప్రోడక్ట్‌ రెడ్‌ వంటి కలర్ ఆప్షన్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఈ రెండు ఫోన్లలో ఒకటే ప్రాసెసర్ అందించారు.అదే ఏ15 బయోనిక్‌ చిప్‌.ఇది గత ఏడాది రిలీజైన ప్రాసెసర్.

Advertisement

ఇక ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ 12 ఎంపీ కెమెరాలు అందించారు.ఐఫోన్‌ 14 స్టార్టింగ్ ప్రైస్‌ను 799 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది.అంటే ఇండియన్ కొనుగోలుదారులు దాదాపు రూ.79,900తో ఐఫోన్‌ 14ని సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్‌ మొబైల్‌ను 899 డాలర్లు ధరతో లాంచ్ చేసింది.ఇండియాలో దీనిని రూ.89,900కి పొందొచ్చు.ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుంచి భారతదేశంలో విక్రయానికి వస్తుంది.

ఐఫోన్ 14 ప్లస్ బుధవారం, అక్టోబర్ 7 నుంచి అందుబాటులో ఉంటుంది.వీటిని యాపిల్.

కాం, యాపిల్ ఆథారైజ్డ్ రీసెల్లర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.ఇక ఇదే సిరీస్‌లోని ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మొబైల్స్ కూడా అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయ్యాయి.

నీచుడా.. మూత్రం చేసిన చేతులతో పండ్ల వ్యాపారం..(వీడియో)
వీడియో: వావ్, బుల్లెట్ నుంచి అద్భుతంగా తప్పించుకున్న జింక..

ఇవి సరికొత్త పర్పుల్‌ కలర్‌లో అందుబాటులోకి వచ్చాయి.వీటిలో సరికొత్త ఏ16 బయోనిక్‌ ప్రాసెసర్ వాడారు.ఐఫోన్‌ 14 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే యూజర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.14 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల లార్జ్ డిస్‌ప్లే ఆఫర్ చేస్తోంది.వీటిలో 48 ఎంపీ కెమెరా, డైనమిక్‌ ఐలాండ్‌ తదితర ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

ఐఫోన్‌ 14 ప్రో 999 స్టార్టింగ్ ప్రైస్ డాలర్లతో విడుదలయింది.అంటే దీనిని ఇండియాలో రూ.1,29,900కి కొనుగోలు చేయవచ్చు.ఇక 14 ప్రో మ్యాక్స్‌ ధర 1099 డాలర్లు కాగా భారత్‌లో రూ.1,39,900కి ఇది లభిస్తుంది.సెప్టెంబరు 16 నుంచి ఈ రెండు మొబైల్స్ కొనుగోలు దారులకు అందుబాటులోకి వస్తాయి.

తాజా వార్తలు