ఈ స్కీమ్స్‌లో డబ్బులు పెడితే డబుల్.. వీటిపై లుక్కేయండి

తమ వద్ద ఉన్న డబ్బులను కొందరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు.అయితే ఖచ్చితంగా మనకు లాభాలు వస్తాయని గ్యారంటీ లేదు.

అయితే ప్రభుత్వమే కొన్ని స్కీమ్స్‌ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.వాటిలో మనం మన పొదుపును దాచుకుంటే కొన్నేళ్లలో మనకు ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది.

వాటి గురించి తెలుసుకుందాం.సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్)లో 60 ఏళ్లు దాటిన వారు రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

Invest Money In These Schemes To Get Double Profits Details, Scheme, Income, D

ఆ మొత్తంపై వీరికి 8 శాతం వడ్డీ లభిస్తుంది.దీని కాల వ్యవధి ఐదేళ్లు.ఈ గడువు పూర్తయిన తర్వాత స్కీమ్ వ్యవధిని మరో మూడేళ్లకు పెంచుకునే వెసులుబాటు ఉంది.

Advertisement
Invest Money In These Schemes To Get Double Profits Details, Scheme, Income, D

దీనితో పాటు సుకన్య సమృద్ధి స్కీమ్‌ కూడా గరిష్ట వడ్డీని అందిస్తోంది.బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 10 ఏళ్ల లోపు ఆడపిల్లల పేరు మీద ఈ స్కీమ్‌లో డబ్బులు కట్టవచ్చు.దీనిపై 7.6 శాతం వడ్డీ వస్తుంది.ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు ఈ పథకంలో కట్టవచ్చు.

Invest Money In These Schemes To Get Double Profits Details, Scheme, Income, D

స్కీమ్ మెచ్యూరిటీ 21 ఏళ్లు కాగా, పథకంలో భాగంగా 15 సంవత్సరాలు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి, డబ్బులు రెట్టింపు పొందాలనుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర పథకం చక్కటి అవకాశం అని చెప్పొచ్చు.ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే 7.2 శాతం వడ్డీ అందుతుంది.ఇదే కాకుండా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ కూడా డబ్బులు దాచుకునేందుకు మంచి పథకం.

ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు.ఐదేళ్లకోసారి గడువు పెంచుకోవచ్చు.

ఒక శాతం వడ్డీ లభిస్తుంది.

వైరల్ వీడియో.. అరెరే.. ఇక్కడ మహేష్ బాబు ఫైటింగ్ సీన్ ఉందా? చూడనే లేదు!
Advertisement

తాజా వార్తలు