తెలుగు రాష్ట్రాల్లోని మత్స్యకారులను వెంటాడుతున్న డెవిల్ ఫిష్.. మళ్లీ వచ్చేసింది!

తెలుగు రాష్ట్రాలలోని మత్స్యకారులను దెయ్యం చేప( Devil Fish ) వెంటాడుతోంది.

డెవిల్ ఫిష్ అని పిలిచే ఈ ఇన్వేసివ్ సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమలలోని 65% నీటి వనరులలో మళ్లీ కనిపించిందని LaCONES అధ్యయనం కనుగొంది.

సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్( Sailfin Catfish ) అనేది స్థానికేతర జాతి, ఇది 1980లలో మొదటిసారిగా భారతదేశానికి వచ్చింది.పేరుకు తగినట్లే ఇది ఇతర చేపలను దారుణంగా చంపుకొని తినేస్తుంది.

స్థానిక చేప జాతులను నాశనం చేస్తుంది.డెవిల్ ఫిష్ స్థానిక చేపల సంతానోత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది.

సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్ తూర్పు కనుమల జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున అధ్యయనం ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ ఆక్రమణల వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.2016లో విజయవాడలోని కృష్ణా నదిలో( Krishna River ) తొలిసారిగా దెయ్యం చేప కనిపించగా.ఇప్పుడు ఎక్కువ చోట్ల కనిపించడం మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది.

Invasive Devilfish Return To Haunt Fishermen In Ap Telangana Details, Lacones St
Advertisement
Invasive Devilfish Return To Haunt Fishermen In AP Telangana Details, LaCONES St

దెయ్యం చేప శరీరంపై పదునైన వెన్నుముకలు ఉంటాయి.ఇవి ఫిషింగ్ వలలను ఈజీగా తెంపగలవు.ఇది దేశీయ చేప కాదు, దీనికి మార్కెట్‌లో పెద్దగా రేట్ కూడా ఉండదు.

ఈ చేప పదునైన పళ్ళతో గాయపరచగలదు.దీనిని పట్టుకుని కొందరు మత్స్యకారులు( Fishermen ) గాయపడ్డారు.

డెవిల్‌ఫిష్ తక్కువ-ఆక్సిజన్ వాతావరణంలో జీవించగలదు.ఇది భూమిపై కూడా పాకుతూ వేరే నీటి వనరులలోకి దూకగలదు.

సర్వభక్షక జాతి అయిన ఈ డెవిల్ ఫిష్ తూర్పు కనుమలలో స్థానిక చేప జాతులను వేటాడుతుందని, దాని ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే భారీ నష్టాలు తప్పవని LaCONES అధ్యయనం అభిప్రాయపడింది.

Invasive Devilfish Return To Haunt Fishermen In Ap Telangana Details, Lacones St
'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
రైలులోని అమ్మాయిలపై నీళ్లు చల్లిన యువకుడు.. వీపు పగిలేలా కొట్టిన పోలీస్ (వీడియో)

చేపలకు హాని కలిగించని సాంకేతికతను ఉపయోగించి తూర్పు కనుమలలోని అనేక నీటి వనరులలో డెవిల్ ఫిష్ ఉన్నట్లు అధ్యయనం కనుగొంది.డెవిల్ ఫిష్ మొదట గోదావరి నదిలో కనిపించింది, తర్వాత కృష్ణా నదిలోకి ప్రవేశించింది.అనంతరం ఈ చేపలు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ( Prakasham Barriage ) వద్దకు వెళ్లి కృష్ణా, మూసీ నదుల ఎగువన చేరాయి.

Advertisement

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (NBA) ఆక్రమణగా జాబితా చేసిన 14 జాతులలో ఆరింటిని కేవలం అలంకారమైన చేపల వ్యాపారం కోసం మాత్రమే పెట్టినట్లు స్టడీ తెలిపింది.

తాజా వార్తలు