నటుడు కృష్ణ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కృష్ణ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేసిన కృష్ణ తేనె మనస్సులు సినిమాతో హీరోగా మారారు.సొంతంగా పద్మాలయ నిర్మాణ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా కృష్ణ ఎన్నో సినిమాలను నిర్మించి మంచి నిర్మాతగా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

కృష్ణ దర్శకుడిగా 16 సినిమాలను తెరకెక్కించడం గమనార్హం.సూపర్ స్టార్ కృష్ణ ఏపీలోని గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో జన్మించారు.

అయితే కృష్ణ తన సినీ కెరీర్ లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ప్రైవేట్ మాస్టర్ సినిమాలో మాస్టారు సినిమాలో మాత్రం విలన్ పాత్ర పోషించారు.కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం సినిమా సింహాసనం, తొలి సినిమా స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజును నిర్మించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

Advertisement

55 సంవత్సరాల సినీ కెరీర్ లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు.అప్పట్లో కృష్ణకు రికార్డు స్థాయిలో ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఉండేవి.కృష్ణ బీఏ చదువుతున్న సమయంలో ఏలూరులో ఏఎన్నార్ కు జరిగిన సన్మానాన్ని చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నారు.1989 సంవత్సరంలో కృష్ణ లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.1968 సంవత్సరంలో రిలీజైన అసాధ్యుడు సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించారు.ఆ తర్వాత ఆ గెటప్ వల్లే కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించారు.

1972లో దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాగా కృష్ణ ఏడు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం సేకరించి ఆ మొత్తాన్ని కరువు బాధితుల నిధికి కృష్ణ విరాళంగా ఇచ్చారు.1977 సంవత్సరంలో ఢిల్లీలోని తెలుగువారు కృష్ణకు నటశేఖర్ బిరుదును ప్రధానం చేశారు.ఆర్థికంగా చితికిపోయిన నటులకు కృష్ణ బాసటగా నిలిచేవారు.

దర్శకుడు వి రామచంద్రారావు అల్లూరి సీతారామరాజు షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే చనిపోతే కృష్ణ ఆ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మాత్రం రామచంద్రారావు పేరునే వేశారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు