కెనడా విద్యపై భారతీయ విద్యార్ధుల ఆసక్తి...గడిచిన 5 ఏళ్ళలో భారీ మార్పులు.

భారతీయ విద్యార్ధుల డాలర్ డ్రీమ్స్ అనగానే ఒకానొకప్పుడు అమెరికానే గుర్తొచ్చేది, అమెరికా వెళ్ళాలి, అమెరికాలో చదువుకోవాలి, అమెరికాలో మంచి ఉద్యోగం చేయాలి, స్థిరపడాలి, ఇలా ప్రతీ విషయంలో అమెరికానే వారి మొదటి ప్రాధాన్యతగా ఉండేది.

అయితే రాను రాను వారి ఆలోచనా దృక్పదం మారుతూ వస్తోంది.

అమెరికాలో విధిస్తున్నవీసా ఆంక్షల నేపధ్యంలో భారతీయ విద్యార్ధులు బ్రిటన్, కెనడా వంటి దేశాలకు వలసలు వెళ్తున్నారు.ప్రస్తుతం భారతీయ విద్యార్ధులు అమెరికా తరువాత కెనడాలో చదువులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆ మాటకొస్తే అమెరికా చదువులకు దాదాపు మేజారిటీ భారతీయ విద్యార్ధులు స్వస్తి పలికినట్టేనట.

ఇదిలా ఉంటే కెనడాలో చదువుకునేందుకు ఎందుకు భారతీయ విద్యార్ధులు మక్కువ చూపుతున్నారంటే అమెరికా విధించే వీసా నిభందనలు ఒకటైతే మరొకటి అదే సమయంలో కెనడా వీసాలపై నిభందనలు సదలిచడం మరో కారణం.ప్రతిభావంతులైన భారతీయ విద్యార్ధులను ఆకట్టుకునేందుకు కెనడా ప్రభుత్వం తమ నిభంధనల్లో భారీ మార్పులు చేసిందట.ఇందులో భాగంగా 2022 లో 4.31 లక్షల మందికి 2023 లో 4.47 లక్షల మందికి , 20 24 లో సుమారు 4.51 లక్షల మందికి శాశ్వత రెసిడెన్సీ హోదాను కలిగించేలా ప్రణాళికలు సిద్దం చేసింది.ఈ పరిణామాలతో భారత్ నుంచీ కెనడా వెళ్ళే విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగిందని అంటున్నారు నిపుణులు.

గతంలో ఒకేసారి 4.05 లక్షల మంది విద్యార్ధులకు కెనడా శాశ్వత రెసిడెన్స్ హోదా కల్పించింది.ఇది కెనడా చరిత్రలోనే అత్యంత భారీ రికార్డ్, ఏ దేశం కూడా ఇలాంటి సాహసం చేయలేదని చెప్పాలి.

Advertisement

గతంలో భారతీయ నిపుణులను ఆకర్షించిన అమెరికా ప్రస్తుతం అగ్ర రాజ్యంగా ఎదిగిందంటే అందులో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకం ఈ విషయాన్ని గ్రహించిన కెనడా భవిష్యత్తులో తాము ఆర్ధికంగా ఎదిగేందుకు భారతీయ విద్యార్ధులను తమ దేశంవైపు ఆకర్షించే ప్రయత్నం చేయడమే కాకుండా ఇందులో సఫలం అయ్యిందని అంటున్నారు నిపుణులు.ఇదిలాఉంటే భారతీయ విద్యార్ధులు కెనడా వైపు ఆకర్షితులు అవడంతో అమెరికా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు