డ్రోన్ కెమెరాలకు ఇన్సూరెన్స్.. నష్టపరిహారం ఎలా వస్తుందంటే..

డ్రోన్ కెమెరాను వినియోగిస్తున్న వారు తమ డ్రోన్‌లకు ఇన్సూరెన్స్ పొందొచ్చు.కొన్ని బీమా కంపెనీలు ఈ ఫెసిలిటీని తాజాగా లాంచ్ చేశాయి.

డ్రోన్ల వినియోగ ఇండియాలో బాగా పెరిగిందనే చెప్పాలి.వస్తువుల డెలివరీకి, పెళ్లి కవరేజ్, టీవీ ఛానెల్, వినోదం, వ్యవసాయం, సర్వే, సర్వేలెన్స్ వంటి రంగాలలో డ్రోన్లను ప్రజలు బాగా వాడేస్తున్నారు.

వాహనాలు రోడ్లపై తిరుగుతుంటే ఇప్పుడు డ్రోన్లు ఆకాశంలో తిరుగుతూ వాహనాల వలే ఎయిర్ ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నాయి.ఇలాంటి డ్రోన్లకు వాహనాలు వలె ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని దేశంలోని డ్రోన్ రూల్స్-2021 చెబుతోంది.

ఈ రూల్ ప్రకారం 250 గ్రాముల కంటే బరువైన అన్ని డ్రోన్లకు థర్డ్ పార్టీ బీమా తీసుకోవడం తప్పనిసరి.1988 నాటి మోటారు వెహికల్ యాక్ట్ నిబంధనలు ఈ డ్రోన్‌ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కూడా వర్తిస్తాయి.డ్రోన్‌ను ఎగురుతున్నప్పుడు ఆస్తికి నష్టం లేదా వ్యక్తులకు గాయం అయినప్పుడు ఈ థర్డ్ పార్టీ బీమా కవర్ నష్టాన్ని భరిస్తుంది.

Advertisement

ప్రస్తుతం ఇండియాలో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, బజాజ్ అలయన్జ్, టాటా AIG, న్యూ ఇండియా అస్యూరెన్స్ బీమా కంపెనీలో డ్రోన్‌లపై బీమా కవరేజీని అందిస్తున్నాయి.మీరు కూడా డ్రోన్ వాడే వారైతే బీమా తీసుకోవడం ద్వారా దానికయ్యే నష్టాన్ని, అలాగే వస్తువులకు అయ్యే డ్యామేజ్ కి, మనుషులకయ్యే గాయాలకు కవరేజ్ అందుకోవచ్చు.ఇకపోతే భారత ప్రభుత్వం డ్రోన్ వినియోగాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తుంది.

త్వరలోనే ఈ డ్రోన్లు భారతదేశం వ్యాప్తంగా తిరుగుతూ చాలా పనులను చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు