హైదరాబాద్ పరిధిలో తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం..!

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సోదాల్లో భారీగా గంజాయి, బంగారం, వెండి, నగదు( Gold,Silver ) పట్టుబడుతోంది.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ.1.15 కోట్ల విలువైన బంగారం, వెండి, గంజాయి పట్టుబడింది.అయితే ఈ సోదాల్లో ఎక్కువగా గంజాయినే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలోనే పట్టుబడిన గంజాయి విలువ రూ.60.78 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.కాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్( Election Code ) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు