Indore Court : నిరుద్యోగి అయిన భర్తకు భరణం చెల్లించాలంటూ కోర్టు తీర్పు.. ఆ ఖర్చులు కూడా భరించాలంటూ?

సాధారణంగా భర్త విడిపోయిన భార్యకు తన ఆదాయంలో కొంత మొత్తాన్ని భరణంగా ఇవ్వడం జరుగుతోంది.

అయితే భర్త నిరుద్యోగి( Unemployed Husband ) అయ్యి భార్య సంపాదించే వ్యక్తి అయితే మాత్రం భార్య నుంచి భర్త కూడా భరణం పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

తాజాగా నిరుద్యోగి అయిన భర్తకు భరణం చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇండోర్ లోని కుటుంబ న్యాయస్థానం( Indore Family Court ) ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది.

నిరుద్యోగి అయిన భర్తకు నెలకు 5000 రూపాయల చొప్పున భరణం చెల్లించాలని వ్యాజ్య ఖర్చులను సైతం భార్య చెల్లించాలని కోర్టు ఆదేశించింది.భార్య( Wife ) ఒక బ్యూటీ పార్లర్ కు యజమానురాలు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పడం గమనార్హం.

భార్య శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడంతో భర్త( Husband ) ఇంటర్ తర్వాత పై చదువులు చదవలేదని అతని తరపు లాయర్ తెలిపారు.

Advertisement

2022 సంవత్సరంలో పెళ్లి జరిగిందని మహిళ, ఆమె బంధువులు బెదిరించి తన క్లయింట్ తో పెళ్లి చేయించారని లాయర్ చెప్పుకొచ్చారు.తాను నిరుద్యోగినని తనను తాను పోషించుకోవడం కష్టమవుతోందని భర్త కోర్టును ఆశ్రయించగా మహిళ తరపు బంధువులు మాత్రం వివాహ బంధాన్ని పునరుద్ధరించాలని కోరడం గమనార్హం.ఈ కేసు తీర్పును చాలామంది మగవాళ్లు ప్రశంసిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాలలో భర్త, అతని కుటుంబంపై భార్యలు కేసులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి.ఇలాంటి తీర్పుల వల్ల అలాంటి కేసుల సంఖ్య తగ్గుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది మహిళలు ఈ తీర్పును స్వాగతిస్తుండగా ఎక్కువమంది మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

ఇండోర్ కోర్ట్( Indore Court ) ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు