రోడ్లపై శవపేటికలు పెట్టి ప్రజల్ని భయపెడుతున్న ప్రభుత్వం.. కారణం ఏంటంటే?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మాస్కు పెట్టుకోవాలని, శానిటైజర్ ఉపయోగించుకోవాలని ఎంతోమంది చెప్తున్నారు.

కానీ ప్రజలు ఏ మాత్రం వినడం లేదు.దీంతో వివిధ దేశాలలో కరోనా నుంచి రక్షించుకునేందుకు వివిధ రకాలుగా ప్రజలకు చెప్తున్నారు.

Indonesia Placing Dummy Coffins To Raise Covid Awareness, Corona Virus Indonesia

అయినా పట్టించుకోవడం లేదు.అలానే ఇండోనేషియాలోను మాస్కులు పెట్టుకోవడం లేదు.

నిబంధనలను ఏ ఒక్కరు పాటించడం లేదు.దీంతో ప్రజలను భయపెట్టి అయినా సరే నిబంధనలు పాటించేలా చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.

Advertisement

దీంతో రద్దీగా ఉండే రోడ్లపైనా ఖాళీ శవపేటికల్ని పెట్టారు.వాటిపైన కోవిడ్-19 బాధితుడు అంటూ ఎర్రటి రంగు అక్షరాలతో పెద్దగా రాసి పెట్టారు.

అంతేకాదు అక్కడ ఎంతమంది కరోనా భాదితులు ఉన్నారు? ఎంతమంది చనిపోయారు అనేది కూడా రాసి పెట్టారు.దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రతి చోటా అలాగే పెట్టారు.

వీటిని చూసి ప్రజలు భయపడి అయినా నిబంధనలను పాటిస్తారు అని, మాస్కులు,గ్లౌజులు తప్పనిసరిగా దరిస్తారని అక్కడ అధికారులు తెలిపారు.మరి వీటిని చూసైనా ప్రజలు నిబంధనలు పాటించి బాధ్యతగా వ్యవహరిస్తారెమో చూడాలి.

రైలులోని అమ్మాయిలపై నీళ్లు చల్లిన యువకుడు.. వీపు పగిలేలా కొట్టిన పోలీస్ (వీడియో)
Advertisement

తాజా వార్తలు