భారత సంతతి మహిళలపై విద్వేష దాడి.. ఆమెను వదలొద్దు : డల్లాస్ పోలీసులకు రాజా కృష్ణమూర్తి వినతి

ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలపై అమెరికన్ మహిళ విద్వేష దాడికి తెగబడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

దీనిపై ఇండో అమెరికన్ కమ్యూనిటీ భగ్గుమంది.

దీనికి కారణమైన మహిళను కఠినంగా శిక్షించాలని అమెరికా ప్రభుత్వాన్ని భారతీయ సంఘాలు కోరుతున్నాయి.తాజాగా భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సైతం ఈ ఘటనపై స్పందించారు.

దాడికి పాల్పడిన మహిళపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డల్లాస్ పోలీసులను కోరారు.జాత్యహంకారం, జెనోఫోబియా తదితర ద్వేషాలతో ప్రేరేపించబడిన ఇటువంటి మూర్ఖపు దాడులు ప్రమాదకర వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా సమాజాలను కూడా బాధితులుగా చేస్తాయని రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

భారత సంతతికి చెందిన నలుగురు మహిళలపై ద్వేషపూరిత వేధింపులు, దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన అన్నారు.కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి మనదేశంలో ఆసియా అమెరికన్లపై విద్వేష దాడులు జరుగుతున్నాయని రాజా కృష్ణమూర్తి గుర్తుచేశారు.

Advertisement

అమెరికన్లు దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా.గత వారం డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఈ విద్వేష దాడి చోటు చేసుకుంది.నాకు భారతీయులంటే అసహ్యం.

అక్కడ మంచి జీవితం లేకపోవడం వల్లే మీరంతా అమెరికా వస్తున్నారు.మీ దేశానికి మీరు వెళ్లిపోండి.

ఎక్కడికి వెళ్లినా మీరే కనిపిస్తున్నారంటూ ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు