అమెరికాలో వైభవంగా భారతీయ “పురషుల పెళ్లి”..

అమెరికాలో గే పెళ్ళిళ్ళు సర్వ సాధారణం అయ్యాయి.ఈ సంస్కృతీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది.

ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఎన్నో దేశాలు అభ్యంతరం తెలిపినా ఆయా దేశాల కోర్టులు వారి హక్కులని కాదనడం సరైనది కాదని గే పెళ్ళిళ్ళకి అనుకూలంగా, గే సెక్స్ కి అనుకూలంగా తీర్పులని ఇచ్చాయి.అయితే గే పెళ్ళిళ్ళు బహిరంగంగా చేసుకోవడానికి ఒకప్పుడు భయపడే వాళ్ళు.

కానీ ఇప్పుడు అవి సాంప్రదాయంగా మారిపోయాయి.

తాజాగా అమెరికాలో ఇద్దరు పురుష ఎన్నారైలు పెళ్లి చేసుకున్నారు.అంతేకాదు ఈ పెళ్లి వారి కుటుంభ సభ్యుల ఆమోదంతో, వారి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.భారత్ కి చెందిన అమిత్ షా ఆదిత్య మాదిరాజు జంట అమెరికాలోని న్యూజెర్సీ లో భారతీయ సాంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకుంది.

Advertisement

రాబిన్స్‌విల్‌లోని బీఏపీఎస్ శ్రీ శ్రీ స్వామినారాయణ్ మందిర్ లో వీరి వివాహం జరిగింది.ఈ పెళ్లి ఫోటోలు వారు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.

దాంతో అబ్బాయి, అమ్మాయి పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇదేమి విడ్డూరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన తాము పట్టించుకోవమని ఆ జంట తెలపడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు