అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటా పోటీ..???

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడటానికి పోటీ తీవ్ర తరం అయ్యింది.

అమెరికా కాంగ్రెస్ కు డెమోక్రటిక్ పార్టీ నుంచీ ఎన్నికైన తోలి హిందూ మహిళా తులసి గబ్బర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో చూచాయిగా చెప్పినా ఈ సారి మాత్రం ప్రకటన చేశారు.

వచ్చే వారం రోజుల్లో తన అభ్యర్ధిత్వంపై కీలక ప్రకటన చేస్తానని ఆమె తెలిపారు.అంతేకాదు ఇదే పార్టీ తరుపున మరి కొంత మంది సైతం పోటీ పడటం గమనార్హం.

భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేట్ కమలా హారిస్ సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లుగా తెలిపారు.ఇదిలాఉంటే తాను ఏకంగా నాలుగుసార్లు అమెరికా కాంగ్రెస్‌కు డెమాక్రటిక్ పార్టీ నుంచి ఎన్నిక అయ్యాయని ,అధ్యక్షా పదవికి పోటీ చేసే అన్ని అర్హతలు తనలో ఉన్నాయని ఆమె అన్నారు.ప్రతి అమెరికా పౌరుడికి ఆరోగ్య సదుపాయాలు, బీమా పాలసీ బెనిఫిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు.

పూర్తి స్థాయిలో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకువస్తామని అన్నారు.పరిశుభ్రమైన నీరు, గాలి అందించేందుకు వీలుగా పర్యావరణాన్ని రక్షించుకోవడమే తన ధ్యేయమని అన్నారు.అమెరికా ప్రజల పూర్తి మద్దతు తనకి కావాలని, ఆమె ప్రకటనలో తెలిపారు.

Advertisement

ఇదిలాఉంటే తులసీ గబ్బర్ కి అమెరికా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజా మద్దతు ఉండటం విశేషం.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..

Advertisement

తాజా వార్తలు