మోడీ అమెరికా పర్యటన : ఇండో - యూఎస్ సంబంధాలపై భారత సంతతి దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు

వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోడీ( PM Modi ) అమెరికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన దౌత్యవేత్త , యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీ రిచర్డ్ ( Richard Verma ) స్పందించారు.

మోడీ పర్యటన నేపథ్యంలో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య రానున్న దశాబ్ధాల్లో సహకారాన్ని నిర్మించడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.తమ అధ్యక్షుడు బైడెన్‌కు( President Joe Biden ) కావాల్సింది ఇదేనని రిచర్డ్ వర్మ అన్నారు.54 ఏళ్ల వర్మ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్మకు దీర్ఘకాలంగా అనుబంధం వుంది.

అంతేకాదు.భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన తొలి భారతీయ అమెరికన్‌గా రిచర్డ్ వర్మ చరిత్ర సృష్టించారు.

ఆ సమయంలో ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేశారు.జో బైడెన్ సైతం.

Advertisement

క్వాడ్, ఐ2యూ2 గ్రూప్‌ల ద్వారా భారత్-అమెరికా సంబంధాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారు.

మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ నేతృత్వంలో జరిగిన ఇండో యూఎస్ పౌర అణు ఒప్పందం వెనుక బైడెన్ కృషి వుందని వర్మ అన్నారు.ఆ సమయంలో సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఈ ఒప్పందం కోసం ఆయన పపోరాడారని తెలిపారు.అలాగే కాంగ్రెస్‌లోని తన డెమొక్రాటిక్ సహచరులను ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా బైడెన్ ఎలా ఒప్పించారో రిచర్డ్ వర్మ గుర్తుచేసుకున్నారు.

అలాగే బైడెన్‌తో కలిసి పలు భారతీయ కమ్యూనిటీ ఈవెంట్‌లలో పాల్గొన్నట్లు తెలిపారు.పౌర అణు ఒప్పందం నాటి నుంచే భారత్ - అమెరికా సంబంధాలు( Indo - US Relations ) బలపడ్డాయని రిచర్డ్ వర్మ స్పష్టం చేశారు.

భారత్ అమెరికాల 75 ఏళ్ల బంధాన్ని చూస్తే 2020వ సంవత్సరం కీలకమైనదిగా ఆయన పేర్కొన్నారు.వచ్చే 20 ఏళ్లలో ఇరు దేశాల బంధం మరో మెట్టుపైకి చేరుతుందని రిచర్డ్ వర్మ జోస్యం చెప్పారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కాగా.జూన్ 21 నుంచి 24 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఇందుకోసం యావత్ ప్రపంచం, ఇరు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు మోడీ రాక నేపథ్యంలో ఆనందంలో మునిగిపోయారు.అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు చేరుకోనున్న మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు