సింగపూర్ : టైమ్ షేర్ రికవరీ స్కీమ్‌లో చీటింగ్ ... భారత సంతతి వ్యక్తిపై 21 అభియోగాలు

టైమ్ షేర్ రికవరీ పథకం కింద ఇద్దరిని మోసం చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తిపై గురువారం సింగపూర్ కోర్టులో అభియోగాలు మోపారు.

నిందితుడిని మురళీధరన్ ముహుందన్‌గా గుర్తించారు.

మోసం చేసినందుకు గాను అతనిపై 21 అభియోగాలు నమోదు చేసినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.టైమ్ షేర్ రికవరీ ఫ్రాడ్‌లో ముహుందన్ చైనీస్ సంతతికి చెందిన ఓయ్ ఫైక్ చెంగ్, భారత సంతతికి చెందిన మరిముత్తు తేరుమలైని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

టైమ్ షేర్ అగ్రిమెంట్‌కు సంబంధించి బెంగళూరుకు చెందిన భాగ్యం ఏజెన్సీస్ చెల్లింపు చేస్తుందని మురళీధరన్ 13 సందర్భాలలో ఓయ్‌ని మోసం చేసినట్లు కోర్టుకు సమర్పించిన పత్రాలలో వెల్లడించారు.చెంగ్.

జూలై 2020 నుంచి గతేడాది జనవరి మధ్య మురళీధరన్‌కు 5,000 సింగపూర్ డాలర్ల నుంచి 1,00,000 సింగపూర్ డాలర్ల వరకు చెల్లించింది.అటు మరిముత్తును 12 సందర్భాలలో మురళీధరన్ మోసం చేశాడు.

Advertisement

అలాగే గతేడాది నవంబర్‌లో కొల్లియర్ క్వేలోని కార్యాలయంలో ఫోటోలు తీసినందుకు 2,50,000 సింగపూర్ డాలర్లు చెల్లించాలని మరిముత్తును బెదిరించాడు.సింగపూర్ డైలీ రిపోర్ట్ ప్రకారం.

మరిముత్తు తన టైమ్ షేర్ షేర్ అగ్రిమెంట్ నుంచి పే అవుట్‌ల రికవరీ కోసం గాను గతేడాది జూలై - నవంబర్ మధ్య మురళీధరన్‌కు 20,000 సింగపూర్ డాలర్ల నుంచి 1,50,000 సింగపూర్ డాలర్ల మధ్య చెల్లించి మోసపోయాడు.

ఈ నేరాలు రుజువైతే మురళీధరన్‌కు పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.అలాగే టైమ్ షేర్ సభ్యత్వాల నుంచి డబ్బును రికవరీ చేయడంలో సహాయపడతామంటూ కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు.అలాగే టైమ్ షేర్ మెంబర్‌షిప్‌కు సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు అందించకూడదని తెలిపారు.

ఇలాంటి వాటిలో సభ్యత్వం తీసుకునేముందు కంపెనీ ట్రాక్ రికార్డు, బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.ఒకవేళ అవసరమైన డాక్యుమెంటేషన్ ఇవ్వడానికి కంపెనీ వెనుకడుగు వేస్తే జాగ్రత్తగా వుండాలని పోలీసులు హెచ్చరించారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

టైమ్‌షేర్ మెంబర్‌షిప్ ఫీజుల రికవరీలో కంపెనీ గతంలోని మెంబర్‌ల పట్ల ఎలా వ్యవహరించింది అనేది కూడా తెలుసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు