యూకే : భారత సంతతి సీఈవోకి ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ అవార్డ్...!!

లిక్కర్ కంపెనీ డియాజియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ భారత సంతతికి చెందిన ఇవాన్ మెనెజెస్‌ యునైటెడ్ కింగ్‌డమ్ న్యూ ఇయర్ హానర్స్‌లో స్థానం సంపాదించారు.

మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన ఇవాన్ వ్యాపారం, సమానత్వానికి చేసిన సేవలకు గాను ఈ గౌరవం పొందారు.

ఆయన బ్రిటన్‌లో సుదీర్ఘకాలం పాటు సేవలందిస్తున్న ఎఫ్‌టీఎస్ఈ (ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్చేంజ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు.ఇక యూకే మొత్తం ఆహార, పానీయాల ఎగుమతుల్లో 10 శాతం (2 బిలియన్ పౌండ్ల) వాటాతో డియోజియోను ప్రపంచంలోని ప్రముఖ ప్రీమియం డ్రింక్స్ కంపెనీగా ఇవాన్‌ మార్చారని యూకే కేబినెట్ కార్యాలయం ప్రశంసించింది.

ఆయన 2013 నుంచి డియాజియోకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు.ఈ కంపెనీకి లాటిన్ అమెరికా, ఆసియా, ఉత్తర అమెరికాలలో పలు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.

మహిళలు,మైనారిటీ వర్గాలకు మెనెజెస్ సమాన హోదాలు కల్పించారని ది ఇండిపెండెంట్ నివేదించింది.ప్రపంచవ్యాప్తంగా డియాజియో సంస్థలోని సీనియర్ నాయకత్వ స్థానాల్లో 42 శాతం మహిళలు, 37 శాతం విభిన్న జాతులకు చెందిన వారికి ఆయన స్థానం కల్పించారు.

Advertisement

నవంబర్ 2020లో ఆయన సుస్ధిరత, కమ్యూనిటీ కార్యక్రమాలలో ఆల్కహాల్ వల్ల జరిగే ప్రమాదాలను పరిష్కరించానికి 1 బిలియన్ పౌండ్ల పెట్టుబడిని ఇవాన్ ప్రకటించారు.2017 నుంచి 2020 వరకు మూవ్‌మెంట్‌ టు వర్క్‌కి ఆయన ఛైర్మన్‌గా వున్నారు.ఇది నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి వున్న స్వచ్ఛంద సంస్థ .1,00,000 నిర్మాణాత్మక ఉద్యోగ నియామకాలను యువతకు అందిస్తుంది.అలాగే ప్రపంచవ్యాప్తంగా వున్న ఆరోగ్య కార్యకర్తల కోసం డియాజియో చీఫ్ .మిలియన్ బాటిళ్ల హ్యాండ్ శానిటైజర్‌ను ఉత్పత్తి చేశారని ఇండిపెండెంట్ పేర్కొంది.ఇకపోతే.భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు కూడా కింగ్స్ న్యూఇయర్ హానర్స్ లిస్ట్‌లో స్థానం లభించింది.COP26 శిఖరాగ్ర సదస్సు ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చేసిన కృషికి గాను అలోక్ శర్మకు ఈ గౌరవం దక్కింది.ఆయనతో పాటు భారత సంతతికి చెందిన ప్రచారకులు, ఆర్ధికవేత్తలు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు 30 మందికి కూడా ఈ హానర్స్ లిస్ట్‌లో చోటు లభించింది.

ఎకనామిక్స్, నేచురల్ ఎన్విరాన్‌మెంట్‌కు చేసిన సేవలకు గాను ప్రొఫెసర్ సర్ పార్థసారథి దాస్‌గుప్తాకు కూడా నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ (జీబీఈ)కి ఎంపికయ్యారు..

Advertisement

తాజా వార్తలు