కెనడా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న “భారత ఎన్నారైలు”

మన భారతీయులు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఉన్నా సరే మనదైన మార్క్ చూపించకుండా ఉండరు.భారతీయుల ప్రతిభాపాటవాలకు అగ్ర దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తుంటాయి.

అమెరికాలో బిడెన్ ప్రభుత్వం వచ్చిన తరువాత భారతీయులకు ఏ స్థాయిలో పదవులు అప్పగించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇక ఆ స్థాయిలోనే కెనడాలో భారతీయుల హవా కొనసాగుతోంది.

కెనడా రాజకీయాల్లో భారతీయులు ప్రధానమైన భూమిక పోషిస్తున్నారు మరొక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పుతున్నారు. భవిష్యత్తులో కెనడా రాజకీయాలు భారత ఎన్నారైల చెప్పుచేతల్లో వస్తాయనే ధీమా వ్యక్తమవుతోంది.

కెనడాలో ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ లో 338 మంది సభ్యులు ఉండగా అందులో సుమారు 22 మంది భారత సంతతి వారు కావడం గమనార్హం.ఈ 22 మందిలో 3 కేబినేట్ మెంబర్స్ ఉన్నారట.

Advertisement

అయితే వీరిలో అత్యధికంగా సిక్కు కమ్యూనిటీ వారు ఉండటం మరొక విశేషం.కెనడాలో సిక్కు కమ్యూనిటీ హవా చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో హౌస్ ఆఫ్ కామన్స్ లో దాదాపు 18 మంది సిక్కు కమ్యూనిటీ ఎంపీలు ఉండేవారట.

మరీ ముఖ్యంగా కెనడాలో కేవలం 4 శాతం మంది మాత్రమే భారత సంతతి ప్రజలు ఉండగా కెనడా ఆర్ధిక, రాజకీయ, అభివృద్ధి రంగాలలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారట.కెనడా ఎన్నికల్లో ఈ సారి మొత్తం ఐదు పార్టీలు పోటీలో ఉండగా మొత్తం 47 మంది భారతీయులు ఆయా పార్టీల నుంచీ బరిలో ఉన్నారని తెలుస్తోంది.ఇదిలాఉంటే ఈ నెల 20 న జరగనున్న ఎన్నికల్లో అందరి దృష్టి న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ పై ఉంది.2017 ఎన్నికల్లో ఆయన పార్టీ ఏకంగా 24 స్థానాలు గెలుచుకుంది.ఒక వేళ ఈ సారి జరిగే ఎన్నికల్లో అదే మ్యాజిక్ ఫిగర్ వచ్చినా అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చినా తప్పకుండా న్యూ డెమోక్రటిక్ పార్టీ కెనడా ఎన్నికల్లో చక్రం తప్పుతుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.

Advertisement

తాజా వార్తలు