Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ సంపాదన గురించి తెలిస్తే షాక్ అవుతారు..

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2022లో భారత బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.సూర్య కుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్లో అద్భుతంగా బౌండరీలు బాధతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

టి20 ప్రపంచ కప్ లో చివరి లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు.ప్రస్తుతం టీమిండియా మిస్టర్ 360 తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నాడు.టి20 ఫార్మేట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.టి20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఒక సంవత్సరం నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ 863 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానానికి దూసుకెళ్లాడు.2016లో దేవిషా శెట్టిని సూర్యకుమార్ యాదవ్ వివాహం చేసుకున్నాడు.దేవిషా ముంబైలో డ్యాన్స్ ట్యూటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.

బేకింగ్ మరియు వంట చేయడం ఆమెకు ఎంతో ఇష్టం.సుజుకి హయాబుసా మరియు హార్లే-డేవిడ్సన్ వంటి స్పోర్ట్స్ బైక్‌లను కూడా సూర్య కుమార్ యాదవ్ దగ్గర ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్ వద్ద BMW 5 సిరీస్ 530d M స్పోర్ట్, ఆడి A6, రేంజ్ రోవర్, హ్యుందాయ్ i20, ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

Advertisement

టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ నికర ఆస్తుల విలువ 15 కోట్లు.ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ సంవత్సరానికి సూర్యకు రూ.3.2 కోట్లు ఇస్తుంది.అతని నెలవారీ సంపాదన రూ.10 నుండి 15 లక్షల వరకు ఉంటుందని అంచనా.అయితే ఐపీఎల్ సమయంలో రూ.40 నుండి 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.అంతేకాకుండా ఒకే సంవత్సరంలో టి20 అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

తాజా వార్తలు