తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు

తెలంగాణలోని పలువురు గ్రానైట్ వ్యాపారుల నివాసాల్లో ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు.వ్యాపారుల నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు.

 It, Ed Raids On Houses Of Granite Traders In Telangana-TeluguStop.com

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.గతంలో ఎనిమిది ఏజెన్సీలకు ఈడీ అధికారులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో విదేశాలకు ఎగుమతులపై ఈడీ, ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్ లో ప్రస్తుతం అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.

పంజాగుట్టలో గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.కాగా పాలకుర్తి శ్రీధర్ మంత్రి గంగుల కమలాకర్ కు అత్యంత సన్నిహితుడని సమాచారం.

అటు కరీంనగర్ లోని అరవింద్ గ్రానైట్స్ వ్యాపారి జగన్నాథ వ్యాస్ ఇంట్లోనూ రైడ్స్ జరుగుతున్నాయి.అంతేకాకుండా మంత్రి గంగుల ఇల్లు, కార్యాలయాల్లోను సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube