కరోనాతో కన్నుమూసిన భారత క్రికెటర్ తండ్రి.. !

దేశంలోకి చొరబడ్ద కరోనా ఒక జీవిత కాలం చదివిన కూడా సరిపడని చరిత్రను లిఖించి వెళ్లింది.ఎందరో మహానుభావులను తన పొట్టన పెట్టుకుంది.

ఇప్పటికి కూడా తన రాక్షస హింసను ఆపడం లేదు.ఇందులో ప్రజల నిర్లక్ష్యం కూడా తోడు అవడంతో కరోనాకు బలం పెరిగింది.

కోవిడ్ టీకా వచ్చినా కరోనా మరణాలు ఆగడం లేదు.రోజు రోజుకు నమోదవుతున్న కేసులతో మరోసారి ప్రభుత్వంలో గుబులు మొదలవుతుందట.

ఇకపోతే కరోనా వల్ల భారత క్రికెటర్ రాహుల్ శర్మ తండ్రి కన్నుమూశారు.ఈ విషయాన్ని రాహుల్ శర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

కాగా రాహుల్ శర్మ 2011 లో టీమిండియా తరపున తన తొలి వన్డే మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుల తరపున ఆడాడు.2006 నుండి పంజాబ్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఇక రాహుల్ శర్మ తండ్రి మృతికి పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు