భారత్ క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో మంగళవారం పర్యటించారు.పర్యటనలో భాగంగా అమీనాబాద్ లోని మూలంకరీశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో, ఫిరంగిపురం సాయిబాబా దేవాలయంలో, ఫిరంగిపురం బాల యేసు చర్చిలో పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం ఫిరంగిపురం సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల, సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల,
మార్నింగ్ స్టార్ కళాశాల విద్యార్థులతో కలసి విద్యార్థులకు పలు సూచన చేశారు.ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ ఈరోజు మా అమ్మగారి పుట్టిన గ్రామానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది, విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని అన్నారు.
ఈ సందర్భంగా ఫిరంగిపురంలోని గ్రామ నాయకులు, ప్రజలు ఆయనను సన్మానించారు.







