హ్యాపీ డేస్ సినిమాతో ప్రేక్షకులకు చేరువైన నిఖిల్ .( Hero Nikhil ) ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగాడు.
వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకస్థానాన్నీ సంపాదించుకున్నాడు.ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి బిజీగా ఉన్నాడు.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమాతో( Karthikeya 2 ) పాన్ ఇండియా స్టార్ గా మారదు .ఇక ఇప్పుడు స్పై తో మరోసారి ఇండియా వైడ్ అభిమానులని అలరించడానికి సిద్ధం అయ్యాడు .ఈ సినిమా ట్రైలర్ చూస్తే .నిఖిల్ ఖాతాలో మరో హిట్ ఖాయమని స్పష్టం అవుతుంది .ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి .ఈ స్థాయికి చేరుకున్న నిఖిల్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
అయన హార్డ్ వర్క్ , కధల ఎంపిక ఆయనకి విజయాల్ని అందిస్తున్నాయని అంటున్నారు .ఇదే సమయంలో అక్కినేని యువ హీరో అఖిల్( Akhil Akkineni ) కెరియర్ పై కూడా చర్చలు సాగుతున్నాయి .నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ మొదటగా మనం సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించారు.ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.
అయితే మొదటి సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ సంపాదించుకోలేదు.అనంతరం ఈయన నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.ఇక వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నఅఖిల్.

ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా( Agent Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .ఈ సినిమా విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నా .ఈ సినిమా విడుదలయి మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ సినీ కెరియర్ ఇబ్బందులలో పడిందని అంటున్నారు అఖిల్ సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడానికి ఆయన సినిమాల ఎంపిక విషయంలో తొందరపాటే కారణమని తెలుస్తుంది .వచ్చిన అవకాశాలన్నింటినీ అందుకొని సినిమాలలో నటించడంతోనే

అఖిల్ ఫ్లాప్ సినిమాలను చవిచూడాల్సి వస్తుంది.ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు తనని వెంటాడటంతో అఖిల్ తన సినిమాల ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.కథలో బలం ఉంటేనే సినిమా చేయాలనీ భావిస్తున్నట్టు తెలుస్తుంది .ఒక సాలిడ్ హిట్ పడితే అన్ని పరాజయాలు మర్చిపోవచ్చని అనుకుంటున్నట్టు తెలుస్తుంది .అయితే నిఖిల్ వంటి వారు దూసుకు వాస్తు ఉండటంతో అఖిల్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి .








