ఎన్నికల టార్గెట్ గానే కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేరలేదని మాణిక్ రావు ఠాక్రే విమర్శించారు.బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పుకోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు.ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు.







