ఖలిస్తాన్ మద్ధతుదారుల బెదిరింపులు.. కెనడాలో భారత కాన్సులర్ క్యాంపులకు భారీ భద్రత

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దిగజారిన సంగతి తెలిసిందే.

దీనికి తోడు భారత ప్రభుత్వంపై జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

ఇరుదేశాల మధ్య సాధారణ పరిస్ధితులు చక్కబడేందుకు చాలా రోజులే పట్టే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితులు, ఖలిస్తానీ మద్ధతుదారుల బెదిరింపులు మధ్య ఈ వారాంతంలో కెనడాలోని ఆరు ప్రదేశాలలో కాన్సులర్ క్యాంపులను నిర్వహించింది భారత్.

వీటికి కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.ఖలిస్తాన్ సానుభూతిపరులు ఓ ప్రాంతంలో కనిపించినప్పటికీ.

భద్రతా వలయాన్ని ఛేదించుకుని వారు కార్యక్రమానికి ఆటంకం కలిగించలేకపోయారు.గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రాంప్టన్, మిస్సిసాగా.

Advertisement

బ్రిటీష్ కొలంబియాలోని వాంకోవర్, ప్రిన్స్ జార్జ్.సస్కేట్చేవాన్ ప్రావిన్స్‌లోని సస్కటూన్‌లలో ఈ కాన్సులర్ క్యాంపులు జరిగాయి.

కెనడా ( Canada )కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) ఈ క్యాంపులను మూసివేయాల్సిందిగా హెచ్చరించింది.కమ్యూనిటీ కార్యక్రమాల ముసుగులో గూఢచారి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నారని ఎస్ఎఫ్‌జే అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆరోపించారు.

శని, ఆదివారాల్లో నిర్వహించిన శిబిరాల్లో 1200కు పైగా సేవలు అందించినట్లు భారత దౌత్యవేత్త ఒకరు తెలిపారు.కెనడాలో నివసిస్తున్న భారత ప్రభుత్వ పెన్షనర్‌లకు లైఫ్ సర్టిఫికేట్‌లను అందించడమే లక్ష్యంగా క్యాంపులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.ఈ తరహా శిబిరాలను ఇండో కెనడియన్ జనాభా ఎక్కువగా వున్న ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

తద్వారా వృద్థులు వివిధ సేవల కోసం ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలోని భారతీయ దౌత్య కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం వుండదు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

శిబిరం జరిగిన వేదికల్లో బ్రాంప్టన్( Brampton ) త్రివేణి మందిరం కూడా వుంది.ఈ ఆలయానికి చెందిన యుధిష్టిర్ ధన్‌రాజ్ మాట్లాడుతూ.ఇక్కడ అంతా సజావుగా సాగిందన్నారు.

Advertisement

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పీల్ రీజినల్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారని, అందువల్ల నిరసనకారులు ఎక్కడా కనిపించలేదని ధన్‌రాజ్ చెప్పారు.ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌ను వినియోగించుకున్న వారిలో 75 శాతం మంది సిక్కు పెన్షనర్లేనని ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు