మోడీ రాక .. ఆ ప్రాంతానికి ‘‘లిటిల్ ఇండియా’’గా పేరు పెట్టండి, ఆస్ట్రేలియాలోని భారతీయుల విజ్ఞప్తి

వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో పశ్చిమ సిడ్నీ శివారు( Western Sydney )లోని భారతీయ కమ్యూనిటీ సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది.

తమ ప్రాంతానికి ‘‘లిటిల్ ఇండియా( Little India )’’ అని పేరు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇక్కడి హారిస్ పార్క్‌( Harris Park )లో వున్న భారతీయ వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, రిటైల్ షాపుల సమూహాన్ని స్థానికులు లిటిల్ ఇండియాగా పిలుస్తారు.దీనికి ఇప్పుడు అధికారికంగా పేరు పెట్టడం వలన ఈ ప్రాంతం మరింత మందిని ఆకర్షిస్తుందని వారు చెబుతున్నారు.

‘‘లిటిల్ ఇండియా హారిస్ పార్క్ బిజినెస్ అసోసియేషన్ ’’ అధ్యక్షుడు సంజయ్ దేశ్వాల్ ( Sanjay Deswal )మాట్లాడుతూ.

ఈ ప్రాంతానికి లిటిల్ ఇండియా అని పెట్టాలనే ప్రతిపాదన తొలిసారిగా 2015లో వచ్చిందన్నారు.అయితే భౌగోళికంగా పేర్లు పెట్టడం గందరగోళాన్ని సృష్టిస్తుందని.అందువల్ల మార్కెటింగ్ మెటీరియల్‌లో ఈ పదాన్ని ఉపయోగించడాన్ని విరమించుకోవాలని పర్రమట్టా కౌన్సిల్‌ దృష్టికి పలువురు తీసుకెళ్లిన నేపథ్యంలో ‘‘లిటిల్ ఇండియా’’ ప్రయత్నాలు ఆగిపోయాయని సంజయ్ తెలిపారు.

Advertisement

ఈ క్రమంలో భౌగోళిక పేర్లకు సంబంధించి చర్చలు కొనసాగిస్తున్నామని.‘‘లిటిల్ ఇండియా’’ పేరును కేటాయించేందుకు అధికారిక దరఖాస్తు తమకు అందలేదని పర్రమట్టా కౌన్సిల్( Parramatta Council ) తెలిపింది.

ఏబీసీ న్యూస్ నివేదిక ప్రకారం.పర్రమట్టా కౌన్సిల్ గత వారం రద్దీగా వుండే విగ్రామ్, మారియన్, స్టేషన్ వీధులను కవర్ చేసే శివారు ప్రాంతంలో కొంత భాగానికి లిటిల్ ఇండియా పేరును వర్తింపజేసే ప్రతిపాదనకు ఓటు వేసింది.

సింగపూర్ సహా తదితర దేశాల్లో లిటిల్ ఇండియా పేరుతో ఇప్పటికే కొన్ని ప్రాంతాలు వున్నాయి.

ఆ మాదిరిగానే ఈ ప్రాంతాన్ని కూడా తాము అంతర్జాతీయ గమ్యస్థానంగా మార్చాలని అనుకుంటున్నట్లు పర్రమట్టా కౌన్సిలర్ ఒకరు అన్నారు.ఇదే సమయంలో హారిస్ పార్క్ శివారు ప్రాంతం మొత్తం పేరు మార్చాలనే ప్రతిపాదనకు బదులు.వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లు వున్న ప్రాంతం వరకే ఈ పేరు వర్తిస్తుందని ఏబీసీ న్యూస్ పేర్కొంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

హారిస్ పార్క్ అనేది పర్రమట్టాను ఆనుకుని వుండే చిన్న శివారు ప్రాంతం.లెబనాన్, ఇటలీ, గ్రీస్, చైనా నుంచి వలస వచ్చిన వారికి ఈ ప్రాంతం నిలయం.అయితే గడిచిన 10, 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో భారతీయుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది.2021 జనాభా లెక్కల ప్రకారం 5,043 మంది హారిస్ పార్క్ నివాసితులలో 45 శాతం మంది భారతీయ మూలాలను కలిగి వున్నారని నివేదిక పేర్కొంది.ఇకపోతే.

Advertisement

క్వాడ్ దేశాధినేతల సమావేశం నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియాకు రానున్నారు.ఈసారి హారిస్ పార్క్‌ను సందర్శించాల్సిందిగా మోడీకి పర్రమట్టా కౌన్సిల్ అధికారికంగా ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది.

తాజా వార్తలు