టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దళితుల మీద కావాలనే దాడులు చేయిస్తున్నారన్నారు.
చంద్రబాబు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు దళితులు తగిన బుద్ధి చెబుతారని మంత్రి మేరుగ తెలిపారు.
శవాల మీద పేలాలు ఎరుకునే విధంగా టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.దళితులపై దాడి చేయడం చంద్రబాబు డీఎన్ఏలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకనైనా దళితులపై చంద్రబాబు, లోకేశ్ లు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.