సియాచిన్‌ మంచు తుఫాన్‌లో చిక్కుకున్న భారత జవాన్‌లు

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రదేశంగా సియాచిన్‌కు గుర్తింపు ఉంది.

భూతలంకు దాదాపుగా 19 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో భారత ఆర్మీ జవాన్‌లు సరిహద్దు వద్ద పహారా కాస్తున్న విషయం తెల్సిందే.

అయితే అక్కడ ఎప్పటికప్పుడు మంచు తుఫాన్‌లు రావడంతో ఇండియన్‌ ఆర్మీ జవాన్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.తాజాగా మరోసారి ఉత్తర సియాచిన్‌లో మంచు తుఫాన్‌ సంభవించినట్లుగా ఆర్మీ అధికారులు ప్రకటించారు.

మంచు తుఫాన్‌ కారణంగా ఆర్మీ జవాన్‌లు మంచులో చిక్కుకున్నట్లుగా ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు.వారిని రక్షించేందుకు యుద్ద ప్రాతిపధికన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.

జవాన్‌లకు రక్షణగా ఉంటామంటూ ఆర్మీ అధికారలు వెళ్లడించారు.ఆర్మీ జవాన్‌లను క్షేమంగా తీసుకు వచ్చేందుకు ఇప్పటికే సహాయక చర్యలు మొదలయ్యాయి.

Advertisement

త్వరలోనే ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యి జవాన్‌లు తిరిగి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు