భారత్‌లో సాంకేతిక అభివృద్ధిపై కృషి .. మోడీపై ఇండో అమెరికన్ సీఈవో ప్రశంసలు

వచ్చేవారం ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi )అమెరికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

ఆయన రాక కోసం అక్కడి స్థానికులు, ప్రవాస భారతీయులు ఎదురుచూస్తున్నారు.

అంతేకాదు.మోడీకి ఘనస్వాగతం పలికేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలావుండగా.భారత్‌లో సాంకేతిక పురోగతి కోసం మోడీ చేస్తున్న కృషిని ప్రశంసించారు భారత సంతతికి చెందిన మైక్రాన్ టెక్నాలజీ( Micron Technology ) ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజయ్ మెహ్రోత్రా( Sanjay Mehrotra ).అమెరికాలోని భారత రాయబార కార్యాలయం షేర్ చేసిన వీడియోలో .సంజయ్ మాట్లాడుతూ మోడీ అమెరికా పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నానని , ఆయనకు స్వాగతం పలకాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

ప్రైవేట్ రంగం, విద్యా సంస్థలు, ప్రభుత్వం ఇలా ప్రతి రంగంలో భారతీయులు తమదైన ముద్ర వేశారని సంజయ్ ప్రశంసించారు.భారతదేశ సాంకేతిక పురోగతి, అభివృద్ధిపై మోడీ నిబద్ధత, విజన్‌‌ను ఆయన కొనియాడారు.యువకుల నైపుణ్యాలపై పెట్టుబడులు పెట్టి భారత ఆర్ధిక వ్యవస్థను నిర్మించేందుకు మోడీ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు.

Advertisement

సెమీ కండక్టర్ పరిశ్రమ , శ్రామికశక్తి అభివృద్ధికి ఆయన తీసుకున్న చొరవ.ఆవిష్కరణ, వ్యాపార వృద్ధి, సామాజిక పురోగతికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించిందని సంజయ్ చెప్పారు.ఆత్యాధునిక మెమొరీ, స్టోరేజ్ టెక్నాలజీలో మైక్రాన్ అగ్రగామిగా వుంది.

సెమీ కండక్టర్ పరిశ్రమలో ముందంజలో వున్న హైదరాబాద్, బెంగళూరులోని ( Hyderabad, Bangalore )తమ ఆర్ అండ్ డీ సెంటర్లలో 3500 మందికి పైగా ఇంజనీర్లు, ఇతర సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని సంజయ్ తెలిపారు.

మరోవైపు .తన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలోని 20 అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలను కలవనున్నారు.ఇందులో మాస్టర్ కార్డ్, యాక్సెంచర్, కోకా కోలా, అడోబ్ సిస్టమ్స్, వీసా తదితర కంపెనీలు వున్నాయి.

యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.అలాగే వాషింగ్టన్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ సెంటర్‌లో 1500 మంది ప్రవాసులు, బిజినెస్ లీడర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు