బీజేపీ బిఆర్ఎస్ ( BRS party )మద్య సయోధ్య కుదిరిందా ? బీజేపీ బి టిమ్ లా బిఆర్ఎస్ పని చేస్తోందా ? బీజేపీ పై బిఆర్ఎస్ ఎందుకు మౌనం వహిస్తోంది ? ప్రస్తుతం ప్రశ్నలు తెలంగాణలోనూ అటు జాతీయ స్థాయిలో లోనూ హాట్ టాపిక్ గా మారాయి.ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మోడి సర్కార్ పై, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన కేసిఆర్ అండ్ కొ.
ఇప్పుడు మోడిని గాని, బీజేపీ నేతలను గాని పల్లెత్తి మాటలు అనడం లేదు.సడన్ గా బిఆర్ఎస్ పార్టీలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనేదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.
ప్రస్తుతం బిఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీనే( Congress party ) లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ బీజేపీని పక్కన పెట్టేశారు.అసలు దీని వెనుక ఉన్న మతలబు ఎంటనేది అర్థం కాక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు.బీజేపీని కేసిఆర్ పక్కన పెట్టడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉండవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితాను డిల్లీ లిక్కర్ స్కామ్ బయట పడేసేందుకే కేసిఆర్ బీజేపీతో సఖ్యత గా మెలుగుతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.ఇంకా మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ప్రభావం ఏం లేదని చెప్పేందుకే పరోక్షంగా బిఆర్ఎస్ బీజేపీని పక్కన పెట్టేసిందనేది మరో మాట.కాగా పోలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న ఈ రెండు మాటల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు.
ఈ మద్య కేసిఆర్ గాని, కేటిఆర్ గాని ఇతరత్రా బిఆర్ఎస్ నేతలు గాని కేవలం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారే తప్పా, బీజేపీ ప్రస్తావననే తీసుకురావడం లేదు.అందుకే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ బి టిమ్ లా పని చేస్తోందా అనే వాదన పెరుగుతోంది.ఇదే విషయాన్ని ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరత్ పవార్ కూడా ( Sharad Pawar )ప్రస్తావించారు.బీజేపీ మినహా ఇతర పార్టీలపైనే విమర్శలు గుప్పిస్తున్న కేసిఆర్.
బిఆర్ఎస్ కు బి టిమ్ లా పని చేస్తున్నారని తెలిసిపోతుందంటూ పవార్ వ్యాఖ్యానించారు.మరి ఇదే వాదన ఇలాగే కొనసాగితే వచ్చే తెలంగాణ తెలంగాణ ప్రజల్లో కేసిఆర్ పై వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంది.
మరి బీజేపీ బి టిమ్ అనే ముద్రను తొలగించుకునేందుకు కేసిఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.