నేడే భారత్-వెస్టిండీస్ 4వ టీ20 మ్యాచ్..మారిన ఓపెనింగ్ జోడీ..!

భారత్ వెస్టిండీస్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్( T20 series ) లో భాగంగా నేడు ఆగస్టు 12వ తేదీ నాల్గవ టీ20 మ్యాచ్ అమెరికాలోని ఫ్లోరిడాలో( In Florida, USA ) ఉండే లాడర్ హిల్ లో జరగనుంది.

ఇప్పటివరకు జరిగిన ఈ సిరీస్ లో భారత్ 1-2 తో వెనుకబడి ఉంది.

ఈ సిరీస్ గెలవాలంటే భారత్ కచ్చితంగా మిగిలి ఉన్న రెండు టీ20 మ్యాచ్ లలో కచ్చితంగా విజయం సాధించాల్సిందే.హార్థిక్ పాండ్యా( Harthik Pandya ) కెప్టెన్సీలో భారత జట్టు ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకోసం జట్టులో ఒక కీలక మార్పు చేశారు.

India-west Indies 4th T20 Match Today Changed Opening Pair , T20 Match, India-w

ఈ నాల్గవ టీ20 మ్యాచ్ నుంచి ఓ ప్లేయర్ ను దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.అతను మరెవరో కాదు.ఫ్యూచర్ స్టార్ గా పేరుపొందిన శుబ్ మన్ గిల్.

Advertisement
India-West Indies 4th T20 Match Today Changed Opening Pair , T20 Match, India-W

చేతికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో గిల్ పూర్తిగా విఫలం అయ్యాడు.వెస్టిండీస్( West Indies ) పర్యటనలో భాగంగా టెస్టులు, వన్డేలు, టీ20 లలో అద్భుతమైన ఆటను ప్రదర్శించలేకపోయాడు.

ఇక ఇతనికి అవకాశం ఇస్తే టీ20 సిరీస్ దక్కడం కష్టమే, అని భావించి కాస్త దూరం పెట్టేశారు.

India-west Indies 4th T20 Match Today Changed Opening Pair , T20 Match, India-w

వెస్టిండీస్ తో జరిగిన టీ20 మొదటి మూడు మ్యాచ్లలో గిల్ 5.33 సగటుతో కేవలం 16 పరుగులు చేశాడు.మొదటి మ్యాచ్లో మూడు పరుగులు, రెండో మ్యాచ్లో ఏడు, మూడో మ్యాచ్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

కాబట్టి ఇతని స్థానంలో మరొక ప్లేయర్ కి అవకాశం ఇవ్వనున్నారు.వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేస్తాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

గ్రీజులోకి వచ్చిన కాసేపటికే దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.కాబట్టి నేడు జరిగే టీ20 మ్యాచులో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ ఓపెనర్ బ్యాట్స్ మెన్స్ గా గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు