రష్యా సహకారంతో ఆరు లక్షల ఏకే 203 అసాల్ట్ రైఫిల్స్‌ను తయారు చేయనున్న భారత్... వివరాలివే...

10 ఏళ్లలో రష్యా సహాయంతో భారత్ 6 లక్షల ఏకే 203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేయనుంది.

యూపీలోని అమేథీ ఫ్యాక్టరీలో వీటి ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.

మార్చి నాటికి భారత సైన్యానికి 5 వేల కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లు అందుబాటులోకి రానున్నాయి.కాగా మరో 32 నెలల్లో 70 వేల ఏకే 203 రైఫిళ్లను భారత సైన్యానికి అందజేయనున్నారు.203 అసాల్ట్ రైఫిల్‌ను ఉత్పత్తి చేస్తూ భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందిఎకె 203 భారతదేశంలో తయారీఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో రైఫిల్స్ తయారీ ప్రారంభమైంది.ఈ కంపెనీ భారతదేశం- రష్యా మధ్య జాయింట్ వెంచర్.

ఈ సందర్భంగా రోస్టెక్ జనరల్ డైరెక్టర్ సెర్గీ చెమెజోవ్ మాట్లాడుతూ.భారత్, రష్యాల మధ్య బలమైన సంబంధాలున్నాయన్నారు.

ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రెండు దేశాల మధ్య సైనిక-సాంకేతిక సహకారం ఫలితంగా ఏర్పడింది.కలాష్నికోవ్ ఏకే 203 ఉత్పత్తితో భారత్‌లో నాణ్యమైన ఆధునిక ఆయుధాల తయారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement

ప్రపంచంలోనే అత్యుత్తమ అసాల్ట్ రైఫిల్స్‌లో ఇదొకటి అని ఆయన అన్నారు.

అమేథీలో మొదటి బ్యాచ్ ఉత్పత్తిజాయింట్ వెంచర్ ప్రణాళిక లక్ష్యం ఏకే 203ను 100 శాతం స్వదేశీ వెర్షన్‌ను ఉత్పత్తి చేయడం.భవిష్యత్తులో కంపెనీ రైఫిల్స్ ఉత్పత్తి, సౌకర్యాలను పెంచే అవకాశాలున్నాయి.రోసోబోరోనెక్స్‌పోర్ట్ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ మిఖీవ్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 7.62 ఎంఎం అస్సాల్ట్ రైఫిల్స్‌తో కూడిన మొదటి బ్యాచ్ ఉత్పత్తి మొదలయ్యిందని తెలిపారు.త్వరలో భారత సైన్యానికి వీటిని అందజేయనున్నారు.

దీనితో పాటు, భారతదేశంలోని ఇతర భద్రతా దళాలకు కూడా ఆయుధాలను అందించే సామర్థ్యాన్ని ఫ్యాక్టరీ కలిగి ఉందన్నారు.ఇదేకాకుండా ఇతర దేశాలకు కూడా ఆయుధాలను ఎగుమతి చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది.

ఏకే 203 ఫీచర్లు ఏమిటి?

ఏకే 203 రైఫిల్ ఏకే సిరీస్‌లో అత్యంత ప్రాణాంతకమైన మరియు ఆధునిక రైఫిల్.సాంప్రదాయ ఏకే సిరీస్‌లో ఉన్న అన్ని లక్షణాలను ఇది కలిగి ఉంటుంది.రష్యా దీనిని 2018లో సిద్ధం చేసింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఏకే 203 అసాల్ట్ రైఫిల్స్ అన్ని వాతావరణ పరిస్థితులలో తేలికగా మరియు ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఈ ఆయుధంతో నిమిషంలో 700 రౌండ్ల కాల్పులు జరపవచ్చు.

Advertisement

దీని పరిధి 500 నుండి 800 మీటర్లు.ఒక సారి 30 రౌండ్లు కాల్చే సామర్థ్యం ఉంది.ఎకె 203 రైఫిల్ బరువు 3.8 కిలోలు.

తాజా వార్తలు