ఈ రాష్ట్రంలో మన దేశంలోనే అత్యంత ఎత్తైన రావణుడి దిష్టిబొమ్మ..?

ఈ సంవత్సరం దసరా పండుగను దేశవ్యాప్తంగా అక్టోబర్ 24వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకొనున్నారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా డెహ్రాడూన్‌లోని చరిత్ర పారేడ్ గ్రౌండ్ లో అక్టోబర్ 24వ తేదీన రావణా దహనం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇందుకోసం డెహ్రాడూన్( Dehradun ) లో సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.ఈ సంవత్సరం ఇక్కడ 131 అడుగుల ఎత్తు ఉన్న దిష్టిబొమ్మను ఇప్పటికే సిద్ధం చేశారు.

ఈ దిష్టి బొమ్మ పర్యావరణనికి అనుకూలమైనదని చెబుతున్నారు.అంతే కాకుండా తక్కువ పటాకులు ఉపయోగించబడినది అని కూడా చెబుతున్నారు.

In This State, The Tallest Effigy Of Ravana In Our Country , Dehradun, Tejinde

లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఐదు సార్లు రికార్డులు సృష్టించిన హస్త కళాకారుడు తేజిందర్ చౌహాన్ ( Tejinder Chauhan )అతని బృందం ఈ దిష్టి బొమ్మను సిద్ధం చేసింది.లంక దహన కార్యక్రమన్నీ బన్ను బిరాదారి నిర్వహిస్తారు.అయితే బన్ను బిరాదారి గురించి సంతోష్‌ సింగ్ నాగ్‌పాల్( Santosh Singh Nagpal ) మట్లాడుతూ 75 సంవత్సరాలుగా బన్ను సోదరులు దసరా పండుగ సందర్భంగా లంక దహన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

Advertisement
In This State, The Tallest Effigy Of Ravana In Our Country , Dehradun, Tejinde

ఈ సారి ఈ ఉత్సవాన్ని మరింత పెద్దదిగా నిర్వహించనున్నారు.ఎందుకంటే ఈ సారి ప్రపంచ రికార్డు హోల్డర్ తేజిందర్ చౌహన్ చేతుల మీదుగా రావణుడి దిష్టిబొమ్మకు ప్రాణం పోయడం జరిగింది.2019లో భారత దేశంలోని సుమారు 221 అడుగుల ఎత్తైన భారీ రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు( Limca Book of World Record )లో స్థానం దక్కించుకున్నాడు.

In This State, The Tallest Effigy Of Ravana In Our Country , Dehradun, Tejinde

ఈ దిష్టి బొమ్మకు కావలసిన రా మెటీరియల్ అంతా అంబులా నుంచి తెప్పించుకున్నామని తెలిపారు.కేవలం ఈ బొమ్మకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ మాత్రం డెహ్రాడూన్ లో తీసుకున్నామని తెలిపారు.ఈ దిష్టి బొమ్మకు ఇప్పటివరకు దాదాపు 13 లక్షల వరకు ఖర్చు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు.

గత మూడు నెలలుగా జితేందర్ చౌహాన్ తో పాటు 25 మంది బృందం ఎంతో శ్రమించి ఈ దిష్టి బొమ్మను సిద్ధం చేసింది.దసరా ( Dasara )ఏర్పాట్ల పై నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నామని,దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తో పాటు సంస్థలు ముమ్మురంగా ఏర్పాట్లు చేస్తున్నాయని వెల్లడించారు.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement

తాజా వార్తలు