ఆ షాపింగ్‌ మాల్‌లో క్యాషియర్‌ కనిపించడు కానీ పేమెంట్‌ జరిగిపోతుంది?

సాధారణంగా మనం నిత్యావసర సరుకులు కొనాలని అనుకుంటే ఇంటి దగ్గరలో వున్న కిరాణా దుకాణానికో లేదంటే మార్కెట్‌కో వెళుతుంటాం కదా.

అదే పెద్ద పెద్ద పట్టణాలలో అయితే షాపింగ్‌ స్టోర్‌కు వెళుతూ వుంటారు.

ఈ క్రమంలో షాపింగ్‌మాల్‌లోకి వెళ్లిన తరువాత కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాక బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి క్యాష్‌ పే చేస్తూ వుంటారు కదా.అయితే దుబాయ్‌లోని అతి పెద్ద మాల్ లో మాత్రం క్యాషియర్‌ అస్సలు కంటికి కనిపించడు.అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు.

మరి అలాంటప్పుడు సరుకులు తీసుకున్నాక క్యాష్‌ ఎలా పే చేయాలి? అనే ఆలోచన వస్తుంది కదా.ఇపుడు దానిగురించి తెలుసుకుందాం.యూఏఈలోని దుబాయ్‌( Dubai in UAE ) పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో విరాజిల్లుతూ.

ఉంటుంది.పగలంతా పడుకొని రాత్రి మేల్కొనే మహానుభావులు ఇక్కడ చాలామంది వుంటారు.

Advertisement

ఎందుకంటే వారికి అప్పుడే తెల్లారుతుంది మరి.ఈ మహానగరంలో 2018లో అమెజాన్‌ కెరెఫోర్‌ మినీ అనే షాపింగ్‌ స్టోర్‌( Amazon Carrefour Mini is a shopping store ) తెరిచింది.ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది.

అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా దీనికి పేరొందింది.

ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్‌ ఖచ్చితంగా ఉండాల్సిందే.లేదంటే ఈ స్టోర్‌లోనికి నో ఎంట్రీ.ఇక లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

స్టోర్‌లో హై రిజల్యూషన్‌ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి.స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులో ఆటోమేటిక్ గా ప్రత్యక్షమవుతాయి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

షాపింగ్‌ పూర్తయిన తరువాత పేమెంట్‌ ఫోను ద్వారా చేసేస్తే సరిపోతుంది.ప్రత్యేకించి ఇక్కడ క్యాష్ తీసుకోవడానికి అందుకే ఎవరూ వుండరు.

Advertisement

ఐడియా అదుర్స్ కదూ.

తాజా వార్తలు