ఫిలిప్పీన్స్‌లో వెలుగుచూసిన మానవ అక్రమ రవాణా

ఫిలిప్పీన్స్‌లో వెలుగుచూసిన మానవ అక్రమ రవాణా కేసులో అమెరికా జాతీయురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జెన్నిఫర్ టాల్బెట్‌ అనే 43 ఏళ్ల మహిళ బుధవారం మనీలా అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పుడే పుట్టిన శిశువును అపహరించి పిల్లాడిని దేశం దాటించేందుకు ప్రయత్నించింది.

అయితే జెన్నిఫర్ ఆ బాబుకు సంబంధించిన బోర్డింగ్ పాస్‌తో పాటు ఇతర పత్రాలను ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించలేదు.

దీంతో ఆమెపై వారికి అనుమానం కలిగింది.వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు ఫిలిప్పీన్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌బీఐ )అధికారులకు సమాచారం అందించారు.అప్పటికే శిశివు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో తమ బాబును కిడ్నాప్ చేసిన ఆగంతకురాలు ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుందని చిన్న క్లూ సైతం ఇచ్చారు.

Advertisement

దీంతో విమానాశ్రయంలో జెన్నిఫర్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌బీఐ అధికారులు.ఆమె నుంచి శిశువును స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణా కేంద్రానికి తరలించారు.కాగా.

అమెరికాలోని ఓహియోకు చెందిన జెన్నిఫర్‌ టాల్బెట్ మనీలాలో జరుగుతున్న ఒక న్యూస్ కాన్ఫరెన్స్‌కు వచ్చింది.ఆమెపై వచ్చిన ఆరోపణలపై జెన్నిఫర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.

ఈ కేసులో ఆమె దోషిగా తేలితే, జైలు జీవితం తప్పదని ఎన్‌బీఐ అధికారులు తెలిపారు.ఆమె అరెస్ట్‌ను మనీలాలోని యూఎస్ రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?
Advertisement

తాజా వార్తలు