ఆలేరులో పరువు కోసం ఒకరు పాగా వేసేందుకు ఇంకొకరు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:పోలింగ్ తేదీ దగ్గర పడడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపితో ( BRS, Congress , BJP )పాటు ఇతర పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోరాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది.దీనితో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య,( Ailaiah ) బీఆర్ఎస్ అభ్యర్ధి గొంగిడి సునీత విజయం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

అభ్యర్దుల ప్రయత్నాలు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం రాజకీయ పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.ఎలాగైనా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించి పరువు కాపాడుకోవాలని గొంగిడి,తొలి విజయం సాధించి కాంగ్రెస్ పాగా వేయాలని బీర్ల పావులు కదుపుతున్నారు.

ఏది ఏమైనాప్పటికీ ఈ ఎన్నికలు బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు ఛాలెంజ్ గా మారాయని చెప్పొచ్చు.బీజెపితో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ తమ ఉనికిని చాటుకునే దిశగానే వారి ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సమరంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎవరు గెలుపు తీరాలకు చేరనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు 17 నెలల కారాగార జైలు శిక్ష.
Advertisement

Latest Yadadri Bhuvanagiri News