అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం:అదనపు ఎస్పీ చంద్రయ్య.

పోలీస్ అమరవీరుల సంస్కరణ లో భాగంగా ఫ్లాగ్ డే సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్రాజన్న సిరిసిల్ల జిల్లా :పోలీస్ అమరవీరుల సంస్మరణ భాగంగా జిల్లా అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ.

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వారిని స్మరిస్తూ ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్స్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్ విధులు, పోలీసులు ఉపయోగిస్తున టెక్నాలజీ, ఆయుధలు ,పోలీస్ స్టేషన్ ఆవరణ, ఎస్హెచ్ఓ రూమ్, స్టేషన్ రైటర్, లాక్ అప్స్, రిసెప్షన్, ఇన్చార్జి రూమ్, టెక్ టీం రూమ్, తదితర పరిసరాలను, విహెచ్ఎఫ్ వైర్లెస్ సెట్ లను చూపించి వారు నిర్వహిస్తున్న విధుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.పోలీస్ స్టేషన్లో దరఖాస్తు రాగానే విచారణ చేసి ఏ విధంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది, మరియు నిందితులను అరెస్టు చేయడం, కేసు పరిశోధన చేయడం తదితర అంశాల గురించి వివరించడం జరిగింది.

ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చాలనాలు విధించే పద్ధతి షీ టీమ్ పైన అవగాహన కల్పించారు.అదేవిధంగా పోలీస్ శాఖలో వినియోగించే ప్రతి ఆయుధం పల్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఓపెన్ హౌస్ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం,గురించి వివరనిచ్చారు.ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో టౌన్ సి.ఐ ఉపేందర్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ యాదవ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News