రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న మంత్రి కేటీఆర్ అదే సామాజిక మాధ్యమాల ద్వారా సమాధానాలు చెప్పాలని పిలుపునిచ్చారు.గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు ఉన్న తేడాపై ప్రచారం చేయాలన్నారు.
సిరిసిల్లలో ఇన్ని విద్యాసంస్థలు వస్తాయని ఎవరూ అనుకోలేదని చెప్పారు.కేసీఆర్ నాయకత్వం మానేరును సజీవధారగా మార్చిందని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు.అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధిస్తున్నామన్న కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు మాత్రమే అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.







