అమ్మ బాబోయ్ : క్షవరం పేరుతో అలాంటి పనులు చేస్తున్న యువతి..  దాంతో పోలీసులు...

ఈ మధ్య కాలంలో కొందరు డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

ఈ క్రమంలో ఓ యువతి ఇద్దరు యువకులతో కలిసి బ్యూటీ సెలూన్ పేరుతో ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగర పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే స్థానిక ప్రాంతంలో "ప్లాటినమ్ సెలూన్ మరియు బ్యూటీ స్పా" అనే సెలూన్ ని కలకత్తాకు చెందిన ఓ యువతి నడుపుతోంది.ఈ క్రమంలో సెలూన్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు కొందరు స్థానికులు గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మఫ్టీలో వెళ్లి విటుల గుట్టు రట్టు చేశారు.ఈ క్రమంలో కలకత్తాకు చెందినటువంటి ఓ యువతిని మరియు ఇద్దరు  విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయంపై స్పందించిన కొందరు స్థానికులు గత కొద్దికాలంగా బ్యూటీ స్పా పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచార గృహం నడుపుతున్నారని చెబుతున్నారు.అంతేకాక మనుషుల జీవితాలను నాశనం చేసేటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతి మరియు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా రైడ్ లో పట్టుబడిన నిందితులను అరెస్టు చేసి పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. అంతేగాక ఈ బ్యూటీ స్పా బాగోతం వెనక ఎవరున్నారని అంశంపై విచారణ చేస్తున్నారు.

అలాగే నగరంలో ఎవరైనా వ్యక్తులు అనుమానంగా కనబడినా లేదా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు