మనసులోని బాధను వెళ్లగక్కిన హీరోయిన్ ఇలియానా..?

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై రెండో సినిమా పోకిరితోనే ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఇలియానా.

టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్న తరుణంలోనే బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దేవుడు చేసిన మనుషులు సినిమా తరువాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది.

బాలీవుడ్ లో ఇలియానాకు మంచి ఆఫర్లే వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ఇలియానా సక్సెస్ కాలేకపోయింది.టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ జగన సుందరిని మరిచిపోయి చాలా కాలమే అయింది.

చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీలో ఇలియానా నటించగా ఆ సినిమాలో ఇలియానా లుక్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి.లవ్ ఫెయిల్యూర్ వల్ల కొన్ని నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టని ఇలియనా ఈ మధ్య కాలంలో ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ వివిధ అంశాల గురించి స్పందిస్తోంది.

హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసే గోవా బ్యూటీ ఇలియానా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.అందరూ ఈరోజూ అంతర్జాతీయ బాలికల దినోత్సవం అని చెబుతున్నారని మరి నిజంగా బాలికలు సంతోషంగా ఈరోజును సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయా.? అంటూ ఇలియానా ప్రశ్నించారు.కలర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలలోని ప్రతిభను, శక్తిని గుర్తిస్తున్నారా.? ఇంట్లో మగపిల్లాడితో సమానంగా అడపిల్లను తల్లిదండ్రులు చదివిస్తున్నారా.? బాలికలు సమానంగా హక్కులు, అవకాశాలు కలుగుతున్నాయా.? అని ప్రశ్నించారు.భవిష్యత్తులో బాలికలకు రక్షణతో కూడిన అందమైన జీవితం దొరుకుతుందని తాను ఆశిస్తున్నానని పోస్ట్ చేశారు.

Advertisement

ఇలియానా చేసిన ఈ పోస్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు