రోజు ఉదయం ఒక్క‌ స్పూన్ నెయ్యిని ఇలా తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ మీసొంతం!

స్వచ్ఛమైన నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.విటమిన్లు, ఖనిజాలు మరియు అవసరమైన కొవ్వు ఆమ్లాలకు నెయ్యి మంచి మూలం.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉండడం వల్ల నెయ్యి ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఒక స్పూన్( Ghee ) నెయ్యిని రోజు ఉదయం ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకున్నారంటే అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్‌ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, చిటికెడు ఆర్గానిక్ పసుపు( Turmeric ) మరియు చిటికెడు మిరియాల పొడి( Pepper ) వేసి బాగా మిక్స్ చేయాలి.రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయాన్ని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.

నెయ్యి, పసుపు మ‌రియు మిరియాలు కలిపిన ఈ వాట‌ర్‌ లివర్‌ శుభ్రతకు ఉపకరిస్తుంది.శరీరంలో ఉండే విషాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Advertisement

అలాగే నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.పసుపు మ‌రియు మిరియాలు మలబద్ధకాన్ని( Constipation ) తగ్గించడంలో సహాయప‌డ‌తాయి.అందువ‌ల్ల రోజూ ఉద‌యం ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ ను తీసుకుంటే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

నెయ్యి, పసుపు మ‌రియు మిరియాలు కలిపిన వాట‌ర్ హార్మోన్‌లను సమతుల్యం చేయడంలో సహాయకారిగా ఉంటాయి.ఇది మహిళలలో పిసిఓఎస్ వంటి సమస్యలను తగ్గించగలదు.

పసుపు మరియు మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.వీటికి నెయ్యిని జత చేసి తీసుకోవ‌డం శరీరానికి ఆవశ్యకమైన ఫ్యాటీ ఆసిడ్లు అందుతాయి.ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.బ్రెయిన్ షార్ప్ గా ప‌ని చేస్తుంది.

వారానికి ఒక్క‌సారైనా సలాడ్స్ తినండి బాస్‌..!
హాస్తప్రయోగం వలన ఆ సమస్యకు దూరంగా ఉండవచ్చు

అల్జీమర్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.అంతేకాదండోయ్.

Advertisement

నెయ్యి, ప‌సుపు, మిరియాలు క‌లిపి నీటిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలోని వాపు త‌గ్గుతుంది.జాయింట్ పెయిన్స్ లేదా ఆర్థరైటిస్ సమస్యలు నియంత్రణ‌లో ఉంటాయి.

శరీరంలోని మెటబాలిజం రేటు పెరిగి వెయిట్ లాస్ అవుతారు.ఇక శరీర కణజాలంలో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకునే శక్తి కూడా ఈ డ్రింక్ కు ఉంటుంది.

తాజా వార్తలు